నవతరం హీరోల్లో గన్ షాట్ హిట్స్ అందుకుని ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు నాగశౌర్య. అప్పుడప్పుడు పెద్ద హిట్ కొడుతూ ఉనికికి ఏమాత్రం భంగం కలగకుండా మ్యానేజ్ చేస్తున్నాడు. ఊహలు గుసగుసలాడే .. జ్యో అచ్యుతానంద.. ఛలో లాంటి హిట్ చిత్రాలు అతడి కెరీర్ కి బూస్ట్ ఇచ్చాయి. మధ్యలో అరడజను పైగానే పరాజయాలు పలకరించాయి. అయితే ప్రతి పరాజయాన్ని మరో హిట్టు తో కొడుతూ.. బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ ని ముందుకు తీసుకెళుతున్నాడు. అతడి జర్నీలో సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ ఓ కీలక మలుపు. ఈ బ్యానర్ అతడి జీవితంలో అడుగుపెడుతూనే ఛలో రూపంలో బంపర్ హిట్ నిచ్చింది. మామ్ డాడ్ ఉషా- ప్రసాద్ తో కలిసి ఈ బ్యానర్ అభివృద్ధి కోసం శౌర్య అద్భుతమైన ప్రణాళికలు వేస్తున్నాడు. లెజెండరీ నిర్మాత .. మూవీ మొఘల్ రామానాయుడు స్ఫూర్తితో ఇంటిల్లిపాదీ ఆన్ లొకేషన్ పని చేస్తూ కొత్త ట్రెండ్ ని తెచ్చారు. మీడియాతో ఎంతో సన్నిహితంగా ఉండే బ్యానర్ గానూ ఐరా సంస్థ పాపులర్.
అందుకే ఈ బ్యానర్ లో మరో సినిమా తెరకెక్కుతోంది అనగానే ఒకటే క్యూరియాసిటీ నెలకొంది. శౌర్య గత చిత్రం నర్తనశాల సొంత బ్యానర్ లోనే తెరకెక్కి ఫెయిలైంది. దీంతో ఈసారి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని తాజా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మెదటి షెడ్యూల్ పూర్తయింది. జూన్ లో రెండవ షెడ్యూల్ ని తెరకెక్కిస్తారు. ఈ చిత్రంతో రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నాగశౌర్య సరసన మెహరీన్ నాయికగా నటిస్తోంది. సమర్పకుడు శంకర్ ప్రసాద్ అన్నీ తానై ప్రోడక్షన్ చూసుకుంటున్నారు. నిర్మాత ఉషాముల్పూరి రాజీ లేకుండా దర్శకుడి విజన్ కి తగ్గ లొకేషన్ ఇచ్చి రిచ్ గా వుండేలా నిర్మాణ భాద్యతలు చూసుకుంటున్నారట. ఎండా కొండా అనకుండా శౌర్య కుటుంబ సమేతంగా శ్రమిస్తున్నాడని తెలుస్తోంది.
హైదరాబాద్ లోని ఓ కాలనీ లో.. పబ్ లో తొలి షెడ్యూల్ ని పూర్తిచేశారు. ఛలో మంచి ప్రేమకథ.. నర్తనశాల మంచి కామెడి చిత్రం. అదే విధంగా నాగశౌర్య తాజా చిత్రం కథను దర్శకుడు రమణతేజ ప్రాణం పెట్టి తీస్తున్నాడు. కెమెరామెన్ మనోజ్ రెడ్డి ప్రతి ఫ్రేమ్ ని చాలా అందంగా అర్థవంతంగా చిత్రీకరిస్తున్నారని నిర్మాతలు తెలిపారు. ఛలో చిత్రం తరహాలో హిట్ కొట్టాలన్న పంతంతో టీమ్ పని చేస్తోందని వెల్లడించారు.