కింగ్ అక్కినేని నాగార్జున ఎంత సర్దిచెప్పుకున్నా సెప్టెంబర్ లో తన కుటుంబం నుంచి వచ్చిన మూడు సినిమాలు మెప్పించలేదు అన్నది నిజం. శైలజారెడ్డి అల్లుడు-యుటర్న్-దేవదాస్ ఏవి కూడా బయ్యర్లను లాభాల్లోకి తీసుకెళ్లలేకపోయాయి. కానీ కింగ్ లో మునుపటి ఉత్సాహం అయితే ఎప్పటిలాగే ఉంది. కానీ ఒక్క విషయంలో మాత్రం నాగ్ వ్యవహారశైలి కొంత చర్చకు దారి తీస్తోంది. ఇటీవలి కాలంలో నాగ్ తో పాటు అఖిల్ సమంతాలు బ్రాండ్ ఎండార్స్ మెంట్ లో చాలా బిజీగా ఉన్నారు. షాపింగ్ మాల్స్ ఓపెనింగులకు సైతం బాగానే కనిపిస్తున్నారు. అఖిల్ మూడేళ్ళలో చేసింది రెండు సినిమాలే అయినా యాడ్స్ మాత్రం డబుల్ డిజిట్ దాటేశాడు.
సమంతా ఓ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ మొదలుకుని మామిడి పళ్ళ రసాల దాకా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే టీవీలో కనిపిస్తోంది. ఇటీవలే భర్త నాగ చైతన్యతో కలిసి చేసిన ఓ సోప్ యాడ్ మంచి స్పందన దక్కించుకుంది. ఇలా షాపింగ్ మాల్స్ కు ఉత్పత్తులకు ప్రమోటర్స్ గా ఉండటం తప్పేమి కాదు కానీ ఈ మధ్యకాలంలో సినిమాల విషయంలో తన వారసులతో పాటు తన సెలక్షన్ కూడా ఫలితాలను ఇవ్వడం లేదన్న సంగతి విశ్లేషించుకుంటే బెటర్.
గత కొన్నేళ్ళుగా అక్కినేని ట్రాక్ రికార్డు ఏమంత ఘనంగా లేదు. ఊపిరి ఓ మాదిరి హిట్ అనిపించుకున్నాక నాగార్జునకు హిట్ లేదు. రాజు గారి గది 2 సోసో అనిపించుకోగా ఆ తర్వాత ఆఫీసర్ తో లేని మరకను అంటించుకుని కెరీర్ లో మొదటి సారి జస్ట్ ఒక కోటి షేర్ తెచ్చిన అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. ఇక దేవదాస్ సంగతి సరేసరి. ఇక చైతు యుద్ధం శరణం తర్వాత ఏడాది గ్యాప్ తో శైలజారెడ్డి అల్లుడు చేస్తే పెట్టుబడిని సైతం పూర్తిగా వెనక్కు ఇవ్వలేకపోయింది. మూడో సినిమా దర్శకుడిని ఎంచుకోవడానికే నెలల టైం తీసుకున్న అఖిల్ కు మిస్టర్ మజ్ను హిట్ అయ్యి పెద్ద బ్రేక్ ఇస్తే తప్ప కుదురుకోవడం కష్టం.
సమంతా ఉన్నంతలో నయం. ఇప్పుడు యుటర్న్ తో పాటు తమిళ్ సీమ రాజా రెండు స్ట్రోకులు ఇచ్చాయి కాని అంతకు ముందు ఆరు నెలల్లో ఏకంగా మూడు బ్లాక్ బస్టర్లు కొట్టేసింది. సో దుమ్మురేపే ఓ హిట్ కావాలని తమ హీరోలకు కావాలని అక్కినేని అభిమానుల డిమాండ్. షాపింగ్ మాల్స్ ముందు ఎంత సందడి చేసినా అవేవి కిక్ ఇవ్వవని బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.