గ్రేటర్ ఎన్నికల్లో సామాన్యుల సంగతి ఎలా ఉన్నా సెలబ్రిటీలు మాత్రం ఒకరి తర్వాత ఒకరుగా తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. రాజకీయ నాయకులు.. సినీ స్టార్లతో సహా పలువురు ప్రముఖులు ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు పయనమవుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా నాగార్జున.. ఆయన సతీమణి అమల కలిసి ఓటు వేసేందుకు వచ్చారు. ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా అఖిల్ రాలేదన్న మాటకు నాగ్ రియాక్ట్ అవుతూ.. అఖిల్ కు ఓటు లేదని చెప్పారు. అదేంటి అఖిల్ అమూల్ బేబీనా అన్న డౌట్ వచ్చిన పరిస్థితి. అప్పటికప్పుడు సిసింద్రీ సినిమా రిలీజ్ ను లెక్కేసుకున్నా 21 ప్లస్ అఖిల్ కు ఉండాలి. 18 ఏళ్లకే ఓటు హక్కు పొందే అవకాశం ఉన్నప్పుడు.. ఇంతన బాధ్యతారాహిత్యంగా అఖిల్ ఉంటారా? అన్న డౌట్ తో పాటు.. సినీరంగ ప్రముఖుడిగా.. లక్షలాది మందికి అభిమానులున్న కుర్రాడు ఇలా చేయటం ఏమిటన్న డౌట్ వచ్చిన పరిస్థితి.
ఇలాంటి సందేహాల్ని తీర్చుకునేందుకు గూగులమ్మను ఆశ్రయించి అఖిల్ ప్రొపైల్ చూస్తే.. అతడికి ఓటు లేకపోవటానికి కారణం కనిపించింది. 1994 ఏప్రిల్ 8న పుట్టిన అఖిల్ కు లెక్క ప్రకారం ఓటు హక్కు పొందే టైం ఎప్పుడో వచ్చేసింది. అయితే.. అతడు పుట్టింది ఇండియాలో కాదు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ జోస్ లో జన్మించాడు. దీంతో.. అఖిల్ అమెరికాన్ పౌరుడు అయ్యాడు. ఈ కారణం చేతనే అఖిల్ కు ఓటు లేదని నాగ్ చెప్పారు. అంటే.. అఖిల్ ఇండియన్ కాదా..?