అక్కినేని నాగార్జున కెరీర్ లో బ్లాక్ బస్టర్లు ఎలా ఉంటాయో.. నిరుత్సాహపరిచిన కూడా అలాగే ఉంటాయి. అలాగని ఇలాంటి వాటికి పెద్దగా చలించడు నాగ్. ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే నాగార్జున.. హిట్స్-ఫ్లాప్స్ ను పెద్దగా పట్టించుకోడు. కానీ తన రీసెంట్ మూవీ ఓం నమో వేంకటేశాయ విషయంలో మాత్రం ఈ స్టార్ హీరో బాగా నిరుత్సాహపడ్డాడట.
ఈ చిత్రంపై ముందునుంచి అంచనాలు ఎక్కువగా పెట్టుకోవడం.. చాలా సమయం కేటాయించమే కాదు.. బోలెడంత కష్టపడ్డాడు నాగ్. అంత కాదు.. ప్రివ్యూ షోలతో వచ్చిన రివ్యూలు.. ముఖ్యంగా క్లైమాక్స్ లో తన నటనకు వచ్చిన రెస్పాన్స్ ను చూసి.. నాగ్ చాలానే హోప్స్ పెట్టుకున్నాడని తెలుస్తోంది. పైగా మౌత్ టాక్ కూడా సూపర్బ్ గా రావడంతో.. బ్లాక్ బస్టర్ ఖాయం అనుకున్నా.. ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోతోంది ఓం నమో వేంకటేశాయ. సోగ్గాడే చిన్నినాయన లాంటి కొత్త ప్రయోగాన్ని ప్రజలు ఆదరించినా.. ఎవరికి తెలియని కొత్త కంటెంట్ తో రూపొందిన ఈ భక్తిరస చిత్రానికి ప్రేక్షకుల నుంచి మద్దతు రాకపోవడం ఆశ్చర్యపరిచిందని తెలుస్తోంది.
వసూళ్లు మెల్లగా పుంజుకుంటాయని పెట్టుకున్న ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. మనం.. సోగ్గాడే చిన్ని నాయన.. ఊపిరి తర్వాత మళ్లీ తన కెరీర్ లో ఓ సూపర్బ్ మూవీగా నిలుస్తుందని పెట్టుకున్న ఆశలు వమ్ము కావడంతో నాగార్జున డీలా పడ్డాడని అంటున్నారు. రెండు రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడను కూడా మాట్లాడలేదట నాగార్జున.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/