దసరా స్పెషల్ వంటలు: హౌస్ లోకి సోగ్గాడు ఎంట్రీ...

Update: 2019-10-09 05:14 GMT
ఎప్పుడూ ఒకేలా సాగుతున్న బిగ్ బాస్ షో లోకి కళ వచ్చింది. దసరా సందర్భంగా ఇంటిలో అదిరిపోయే వంటకాలు చేసి కంటెస్టంట్స్ అలరించారు. ఆ వంటకాలని టేస్ట్ చేసేందుకు ఏకంగా కింగ్ నాగార్జున హౌస్ లోకి  వచ్చి సందడి చేశారు. మొదట దసరా సందర్భంగా ఇంటి సభ్యులు అందంగా ముస్తాబయ్యారు. తర్వాత బిగ్ బాస్ వారిని రెండు జట్టులుగా విభజించి వంటల పోటీలు పెట్టారు. మొదట జట్టులో బాబా భాస్కర్ - వరుణ్ - మహేశ్ - అలీలు ఉండగా - రెండో జట్టులో శ్రీముఖి - శివజ్యోతి - వితికా - రాహుల్ లు ఉన్నారు.

వీరికి మూడు రౌండ్లుగా వంట పోటీలు పెట్టారు. మొదటి రౌండ్ లో భాగంగా ఒక్కో టీం రెండు చైనీస్ వంటకాలను చేయాలని ఆదేశించారు. దీంతో రెండు టీంలు ఫ్రైడ్ రైస్ - చికెన్ 65 చేశారు. అయితే మొదటి టీం చేసిన వంటల్లో ఆయిల్ ఎక్కువైందనీ.. రెండో టీం చేసిన వంటల్లో ఉప్పు ఎక్కువైందనీ ఫిర్యాదులు రావడంతో బిగ్ బాస్ ఈ రెండు టీంలకు ఒక్క మార్కు కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ రెండో రౌండ్ లో ఆంధ్రా వంటకాలు చేయాలని పోటీ పెట్టారు. దీంతో బాబా టీం చేపల పులుసు - ఫ్రై చేయగా - శ్రీముఖి టీం రొయ్యల కర్రీ చేసింది. అయితే ఈ రెండు కర్రీలు బాగోవడంతో ఇద్దరికి చెరో పాయింట్ వచ్చింది.

ఇక మూడో రౌండ్ లో రెండు టీంలు చెరో స్వీట్ ఐటెమ్ చేశారు. ఆ స్వీట్ ని టేస్ట్ చేయడానికి ఇంటి సభ్యులని సర్ ప్రైజ్ చేస్తూ కింగ్ నాగార్జున సోగ్గాడు గెటప్ లో ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చారు. అందరిని ప్రేమగా పలకరించి...రెండు జట్ల స్వీట్స్ ని టేస్ట్ చేసి....శ్రీముఖి జట్టు చేసిన స్వీట్ బాగుందని ఫైనల్ గా తేల్చేసి లేడీస్ జట్టుని గెలిపించేశారు.
Tags:    

Similar News