సమంత మాటలకు నాగ్ కన్నీళ్లు..
అక్కినేని నాగార్జున ఎప్పుడూ చాలా కూల్ గా కనిపిస్తాడు. ఆయన ఎమోషనల్ కావడం అరుదు. తన తండ్రి ఏఎన్నార్ మరణం గురించి తలుచుకున్నపుడు మాత్రమే ఆయన భావోద్వేగానికి గురవుతుంటారు. ఐతే ఇటీవలే నాగ్ ఇంకో విషయంలోనూ ఎమోషనల్ అయ్యాడట. కన్నీళ్లు పెట్టుకున్నాడట. ఆ సందర్భం.. నాగ్ పెద్ద కొడుకు నాగచైతన్య పెళ్లి. ఆ సందర్భంగా సమంత మాటలకు నాగ్ కన్నీళ్లు పెట్టేసుకున్నాడట.
చైతూ పెళ్లి జరుగుతున్న సమయంలో తనలో రకరకాల భావనలు కలిగాయని.. అతను తాళి కడుతున్న సమయంలో ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిందని నాగ్ చెప్పాడు. దీని తర్వాత జరిగిన క్రిస్టియన్ మ్యారేజ్ తనకెంతో ముచ్చటగా అనిపించిందని నాగ్ చెప్పాడు. క్రిస్టియన్ మ్యారేజ్ లో వధూవరులు ఒకరి గురించి ఒకరు మాట్లాడాలని.. అవతలి వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నది చెప్పాలని.. ఆ సందర్భంలో చైతూ తన జీవితంలో అన్నీ ఉన్నా ఏదో చిన్న వెలితి ఉందని.. దాన్ని సమంత తీర్చిందని చెప్పినట్లు నాగ్ వెల్లడించాడు.
ఆ తర్వాత సమంత అందుకుని నాలుగు నిమిషాల పాటు పేపర్ లేకుండా అనర్గళంగా చైతూ గురించి మాట్లాడినట్లు నాగ్ తెలిపాడు. చైతూ నిద్ర లేవగానే చెదరకుండా ఉండే జుట్టు తనకిష్టమని... అతను ఎన్ని సమస్యలున్నా నవ్వుతూ ఉంటాడని.. దీంతో సమస్యలు వాటంతటవే పరిష్కారం అయిపోతాయని సమంత అన్నట్లు నాగ్ చెప్పాడు. చిన్న చిన్న విషయాలే అయినా చాలా అందంగా.. మనసుకు తాకేలా సమంత చెప్పిందని.. ఇదంతా చూశాక తనకు కన్నీళ్లు వచ్చేశాయని.. కళ్లు తుడుచుకుని వెనక్కి తిరిగితే అందరూ కన్నీళ్లతో కనిపించారని నాగ్ వెల్లడించాడు.