నాగార్జున లాంటి స్టార్ హీరో సినిమా అంతా చక్రాల కుర్చీకి అతుక్కుపోయే ఓ క్యారెక్టర్ చేస్తాడని ఓ ఆరేడేళ్ల ముందు చెబితే జోక్ అనుకునేవాళ్లు. అభిమానులైతే ఆ సంగతి అస్సలు జీర్ణించుకునేవాళ్లు కాదు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది. అభిమానుల్లోనూ మార్పు వచ్చింది. ప్రయోగాత్మక చిత్రాల్ని ఆదరిస్తున్నారు. హీరోయిజం లేని పాత్రల్ని కూడా అంగీకరిస్తున్నారు. హీరోలు పంచ్ డైలాగులు వేస్తూ.. వీర లెవెల్లో ఫైట్లు చేయాల్సిన అవసరమేమీ లేదు ఈ రోజుల్లో. స్టార్ హీరోల సినిమాల్ని కూడా కేవలం ఎమోషన్ల మీద సినిమా నడిపినా జనాలు ఆదరిస్తారని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘మనం’ లాంటి సినిమాలు రుజువు చేశాయి.
ఇలాంటి సినిమాలిచ్చిన భరోసాతోనే నాగ్ చక్రాల కుర్చీకే పరిమితమయ్యే సినిమా చేశాడు ‘ఊపిరి’లో. ఈ సినిమా మొదలయ్యేటప్పుడు జనాల ఆసక్తి అంతంతమాత్రంగానే ఉంది కానీ.. ఇప్పుడు మాత్రం చాలా మాంచి క్రేజ్ కనిపిస్తోంది. ఇక ఈ సినిమా గురించి నాగ్ సహా అందరూ చాలా గొప్పగా చెబుతున్నారు. ఫ్రెంచ్ సినిమా ‘ది ఇన్ టచబుల్స్’కు ఇది రీమేక్. ఒరిజినల్లో కూడా ఎమోషన్లు అద్భుతంగా పండాయి. గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. దాన్ని మన నేటివిటీకి తగ్గట్లు బాగానే తీర్చిదిద్దాడట వంశీ పైడిపల్లి. కంటెంట్ నచ్చితే తప్ప పాటలు రాయని సీతారామశాస్త్రి.. ఈ కథాంశం నచ్చి అన్ని పాటలూ తనే రాయడం విశేషం. మళయాలంలో టాప్ క్లాస్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చి.. తెలుగులోనూ మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, భలే భలే మగాడివోయ్ లాంటి సినిమాలకు సంగీతాన్నందించిన గోపీసుందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. ఇక ‘బొమ్మరిల్లు’లో అద్భుతమైన మాటలు రాసి గొప్ప పేరు సంపాదించిన అబ్బూరి రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.వినోద్ కు సైతం చాలా మంచి పేరుంది. మొత్తానికి టాప్ క్లాస్ టెక్నీషియన్లు పని చేస్తున్న ‘ఊపిరి’ టాప్ క్లాస్ సినిమానే అయి ఉంటుందన్న అంచనాతో ఉన్నారు ప్రేక్షకులు. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే మార్చి 25 వరకు ఎదురు చూడాలి.