ఊపిరి.. అసలు ఈ పేరు వినడానికే చాలా బాగుంది.. ఇక ''నాకు లోపల ఊపిరి ఆడట్లేదు.. బయటకు తీసుకెళ్లు'' అంటూ హీరో కార్తితో నాగార్జున చెప్పే డైలాగ్ చాలు.. ఈ ''ఊపిరి'' సినిమా ఎలా ఉండబోతోందో చెప్పడానికి.
ఫైనాల్ గా ఒక కొత్త కట్ తో కూడిన ''ఊపిరి'' ట్రైలర్ ఇవాళే రిలీజ్ చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ ''ది ఇన్ టచబుల్స్'' రీమేక్.. చాలా ఆసక్తికరంగా ఉంది. నడుం క్రింద నుండి పూర్తిగా పడిపోయిన నాగ్.. అలాగే కేవలం అతని ఆస్తి.. అతని పి.ఏ. తమన్నా అందాన్ని చూసి ఫ్లాటైపోయి అతడికి అసిస్టెంట్ గా చేరిన కార్తి.. మధ్యలో ప్రకాష్ రాజ్ - జయసుధ - గాబ్రియెలా.. ఇలా అందరూ ఆకట్టుకున్నారు. కామెడీతో పాటు యాక్షన్ కూడా ఉన్నట్లుంది. అన్నింటికంటే బ్యూటిఫుల్ ఎమోషన్ చూస్తే మాత్రం కంట్లో నీళ్ళు గింగిరాలు తిరుగుతాయ్ అంతే.
గోపి సుందర్ అందించిన మ్యూజిక్.. పి.ఎస్.వినోద్ కెమెరా వర్క్.. అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి. ఫైనల్ గా ''మీరు అప్పట్లో చాలా రొమాంటిక్ అనుకుంట'' అని నాగ్ ను అంటే.. ''నేను ఇప్పుడు కూడా'' అంటూ అమాయకంగా నాగ్ చెబుతుంటే.. అబ్బో అదిరిపోయింది. మార్చి 25న పివిపి సంస్థ రూపొందించిన ఈ సినిమా ధియేటర్స్ లోనికి వస్తోంది.
Full View