ప్రపంచవ్యాప్తంగా వైరస్ విలయం కొనసాగుతోంది. మహమ్మారీ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. భారత దేశంలో.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేనేలేదు. ఓవైపు ప్రభుత్వాలు నిర్భంధం ఎత్తివేసి ప్రజల్ని స్వేచ్ఛగా వదిలేశాయ్. పర్యవసానంగా వైరస్ భారిన పడేవారి సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. ఇన్నాళ్లు కేవలం నగరాలకే పరిమితమైన ఈ మహమ్మారీ ఇకపై పల్లెల్లోకి ప్రవేశించనుందని అంచనా వేస్తున్నారు. అసలు సిసలు ప్రమాదం ముందుందని సంకేతాలు వెలువడ్డాయి.
అయితే ఇంత కష్టంలోనూ ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకు నిరంతరం పోలీసులే ఆర్మీలా మారి గస్తీ కాస్తున్న తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలిచిన పోలీసుల సేవా భావాన్ని కింగ్ నాగార్జున కొనియాడారు. ఏపీ నుంచి వలస కూలీల్ని తమిళనాడుకు తీసుకెళుతున్న శ్రామిక్ రైలులో ఆహారం లేక ఇబ్బందిపడుతున్నారని తెలిసి వారికోసం ప్రత్యేకించి గుంతకల్లులో ఆహారాన్ని ఏర్పాటు చేసారు పోలీస్. అందుకు సంబంధించిన ఓ వార్తా కథనాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన నాగార్జున ఏపీ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇక కింగ్ కెరీర్ సంగతి చూస్తే.. 2019 లో రిలీజైన మన్మథుడు తీవ్రంగా నిరాశపరిచింది. అంతకుముందు ఆర్జీవీతో చేసిన కాప్ డ్రామా ఒకటి ఫెయిలవ్వడం తీవ్రంగానే బాధించింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి కల్ట్ క్లాసిక్ నే టచ్ చేస్తున్నారు. ఈసారి వైల్డ్ డాగ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కింగ్ ఎన్.ఐ.ఏ అధికారిగా నటిస్తున్నారు. ఇప్పటికే నాగార్జున పోస్టర్లు రిలీజై అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలో ఎన్.ఐ.ఏ అధికారిగా కనిపిస్తూనే ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా నాగార్జున అద్భుత నటనను కనబరచనున్నారన్నది ఇన్ సైడ్ టాక్. ఈ మూవీకి అహీషోర్ సోలొమన్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని జాయింట్ వెంచర్ లో నిర్మిస్తున్నారు.