డ్రాగ‌న్ టాట్టూ గుట్టు విప్పిన కింగ్‌

Update: 2019-09-09 05:27 GMT
కొత్త వాళ్ల‌ని ప్రోత్స‌హించ‌డం.. కొత్త‌ద‌నానికి నాంది ప‌ల‌క‌డంలో టాలీవుడ్ స్టార్ హీరోల్లో ముందు వ‌రుస‌లో ఉంటారు కింగ్ నాగార్జున‌. ట్రెండ్ ని ఫాలో కాకుండా ట్రెండ్ ని సెట్ చేయాల‌ని నిత్యం త‌పించే నాగార్జున కొత్త స్టైల్ ని ఎప్పటిక‌ప్పుడు మార్చేస్తూ న‌వ‌ మ‌న్మ‌థుడిలా క‌నిపించేందుకు త‌పిస్తుంటారు. ఈ విష‌యంలో త‌న‌యులు చైతూ- అఖిల్ ల‌ను మించి నాగార్జునదే పై చేయిగా క‌నిపిస్తుంటుంది. అందుకు ఇదిగో ఈ టాట్టూనే ఓ ప్రూఫ్‌.

ఇటీవ‌ల నాగార్జున‌ ఎక్క‌డ క‌నిపించినా ఆయ‌న చేతిపై ఉన్న‌ కొత్త టాట్టూ అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. త‌న 60వ‌ పుట్టిన రోజు వేడుక‌ల సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్పెయిన్ విహార యాత్ర‌కు వెళ్లిన కింగ్ నాగార్జున‌ ఎడ‌మ చేతిపై కొత్త త‌ర‌హా టాటూను వేయించుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. దీనిపై బుల్లితెర ప్రేక్ష‌కులంతా ఒక‌టే ఇదిగా ముచ్చ‌టించుకున్నారు.

ఆదివారం రాత్రి `బిగ్‌బాస్ 3`లో త‌న టాట్టూ గుట్టును కింగ్ బ‌య‌ట పెట్టేశారు. ఈ షోకి గెస్ట్ గా వ‌చ్చిన నాని డ్రాగ‌న్ టాట్టూ వెన‌కున్న ర‌హ‌స్యాన్ని విప్ప‌మ‌ని అడ‌గ‌డంతో కింగ్ ఆ సీక్రెట్ ని బ‌య‌ట‌పెట్టేశారు. ఇది నా 30వ (60వ‌) పుట్టిన రోజున వేయించుకున్న టాట్టూ అంటూ న‌వ్వేశారు. టాట్టూ వెన‌కున్న అర్థాన్ని వివ‌రిస్తూ `నాగు పాము కుబుసాన్ని విడిచిపెడుతుంది. నేను కూడా అలానే గ‌తాన్ని ప‌ట్టించుకోను. పాము బొమ్మ‌పై వున్న క‌న్ను నాదే. జీవితంలో కొత్త విష‌యాలు వెతుకుతూ ఉంటాన‌న్న గుర్తుకు సింబ‌ల్ ఆ క‌నుబొమ్మ‌. కంపాస్ (దిక్సూచి)పై వున్న `ఎన్‌` అనే అక్ష‌రం ఉత్త‌రం దిక్కు కావ‌చ్చు.. లేదా నా పేరు కూడా కావ‌చ్చు. టోట‌ల్‌గా సంతోషం అనేది మ‌న గుండెల్లోనే వుంటుంద‌ని దీని అర్థం`` అంటూ కొత్త టాట్టూ ర‌హ‌స్యాన్ని విప్పేశారు కింగ్ నాగ్‌. కింగ్ నాగార్జున చేతి ట్రైసెప్ భాగంలో సూర్యుడిని పోలిన వేరొక టాట్టూ `మాస్` మూవీ టైమ్ లో హైలైట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ టాట్టూ క‌ల్చ‌ర్ ని స‌మంత‌- నాగ‌చైత‌న్య కూడా అనుస‌రిస్తున్నారు.


Tags:    

Similar News