కింగ్ డెసిషన్ కరెక్టేనా..?

Update: 2021-03-03 10:30 GMT
'కింగ్' అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''వైల్డ్ డాగ్'' ఏప్రిల్ 2న థియేటర్స్ లో విడుదల అవుతున్నట్లు ప్రకటించారు. దర్శకుడు అహిషోర్ సాల్మోన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమాని లాక్ డౌన్ లో థియేటర్స్ క్లోస్ అవడంతో నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీకి అమ్మేశారు. అయితే ఇప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ అవడమే కాకుండా ఎప్పటిలాగే ప్రేక్షకులు వస్తుండటంతో ఓటీటీ అగ్రిమెంట్‌ ను క్యాన్సిల్ చేసుకుని థియేట్రికల్ రిలీజ్ కి వెళ్తున్నారు. అయితే 'క్రాక్' 'ఉప్పెన' సినిమాలు హిట్ అవడంతో 'వైల్డ్ డాగ్' ని థియేట్రికల్ రిలీజ్ కి షిఫ్ట్ చేయడం కరెక్టేనా? మార్కెట్ పరంగా ఈ సినిమా వర్కవుట్ అవుతుందా? అనే డిస్కషన్ సినీ వర్గాల్లో జరుగుతోంది.

నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వారు 'వైల్డ్ డాగ్' చిత్రానికి సుమారు 35 కోట్లు ఆఫర్ చేసినట్లు టాక్‌. ఇదే కనుక నిజమైతే ప్రొడ్యూసర్స్ లాభాల్లో ఉన్నట్లే. ఎందుకంటే 'సోగ్గాడే చిన్నినాయనా' 'ఊపిరి' సినిమాల తర్వాత నాగార్జున నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బ తిన్నాయి. 'ఆఫీసర్' 'మన్మథుడు 2' చిత్రాలు మినిమమ్ ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోయాయి. ఇలా చూసుకుంటే 'వైల్డ్ డాగ్' సినిమాకి రిటర్న్ ఏ స్థాయిలో వస్తాయనేది ప్రశ్నార్ధకమే. అందులోను ఇది అన్ని వర్గాల వారిని థియేటర్స్ కు రప్పించే సినిమా అని చెప్పలేం. సినిమా విడుదలై హిట్ టాక్ వస్తే మంచి కలెక్షన్స్ వస్తాయి.. లేకపోతేలేదు. కానీ ఇప్పుడు నాగ్ మాత్రం వేరే సినిమాల రిజల్ట్ ని బట్టి ఓటీటీ డీల్ ని క్యాన్సిల్ చేసుకుని థియేటర్స్ లోకి వస్తున్నాడు. ఫ్యాన్సీ డీల్ వదులుకున్నారు అంటే ఇప్పుడు అంతకుమించి వసూలు చేయాల్సి ఉంటుంది. మరి కింగ్ డెసిషన్ ఏ మేరకు వర్క్ ఔట్ అవుతుందో చూడాలి.

ఇకపోతే నెట్ ఫ్లిక్స్ వారితో ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకున్నా శాటిలైట్ రైట్స్ వారి దగ్గరే ఉన్నాయని.. కాకపోతే ముందు అనుకున్న డీల్ కంటే కాస్త తక్కువ వస్తుందని ప్రొడ్యూసర్ తెలిపారు. 'ఓటీటీకి అమ్మి బయటకొచ్చి థియేటర్‌ లో విడుదల అవుతున్న తొలి సినిమా ఇదే. ఈ సినిమా విడుదలైన 30, 40 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల అవకాశం ఉంది' నిర్మాత నిరంజన్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. నాగ్ సైతం 'ఇది ఓటీటీ కోసం తీసిన సినిమా కాదని.. బిగ్ స్క్రీన్ పై ఎక్సపీరియన్స్ చేయాల్సిన సినిమా అని.. తప్పకుండా అందర్నీ అలరిస్తుందని' ధీమా వ్యక్తం చేశారు.
Tags:    

Similar News