నాగ చైతన్య -సమంత బ్రేకప్ వ్యవహారం అక్కినేని కుటుంబానికే గాక అభిమానులకు అతి పెద్ద షాక్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి క్లిష్ఠ సమయంలో తమ కుటుంబానికి మద్ధతివ్వాల్సిన మీడియా సైతం అతి చేసిందని ఆ ఫ్యామిలీ ఆవేదన చెందింది.
సమంతపై రకరకాల పుకార్లు షికార్ చేశాయి. దానికి తాను నొచ్చుకోవడమే గాక చట్ట పరమైన చర్యలు తీసుకున్నారు. అవమానకరమైన కథనాలు వేసిన యూట్యూబ్ చానెళ్ల యజమానులకు కోర్టుల పరిధిలో అక్షింతలు వేయించింది సామ్. అవమానకరమైన వ్యాఖ్యలతో చేసిన కథనాలను యూట్యూబ్ నుంచి తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ కథనాలు కేవలం సమంతను ఉద్ధేశించి లేదా సమంతను మాత్రమే టార్గెట్ చేసినవి కావు. అవి టోటల్ అక్కినేని కుటుంబాన్ని అవసమాన పరుస్తూ చేసిన కథనాలు గా అక్కినేని కుటుంబం భావిస్తోందా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో నాగార్జున తన ఆవేదనను ఎంతో హుందాగా వినిపించారు. పండ్లు ఉన్న చెట్టు పైనే రాళ్లు పడతాయన్న సూక్తిని గుర్తు చేసారు.
ఒక ఇంటర్వ్యూలో నాగార్జున తన కుటుంబం గురించి కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు అసహ్యకరమైన వార్తలను ప్రచారం చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ``ఇది నా గురించి అయితే నేను పట్టించుకోను. నేను ఎప్పుడూ అనుకుంటాను. చెట్టుపై పండ్లు ఉంటే తప్ప వారు రాళ్ళు వేయరు. కాబట్టి ఇందులో పెద్దగా చెప్పుకునే విషయం ఏమీ లేదు. కానీ ఈ రోజుల్లో వారు కుటుంబం గురించి ముఖ్యంగా యూట్యూబ్ ఛానెల్ లలో చెడుగా ప్రచారం చేయడాన్ని చూశాక బాధపడ్డాను`` అన్నారు.
విడాకులకు ముందు కానీ ఆ తర్వాత కానీ సమంతతో నాగార్జునకు మధ్య ఏదైనా అనుకూలత సమస్య తలెత్తిందా లేదా? అన్నది కూడా ఎవరికీ తెలీదు. ఇక మీడియా కథనాలపై నాగ్ చర్యలు తీసుకుంటారా లేదా? అన్నది కూడా ఎవరికీ తెలీదు. ఇకపోతే నాగ్ కెరీర్ లో ఎన్నో వివాదాస్పద కథనాలు వెలువడినా కానీ మీడియాపై పెద్దగా స్పందించిందేమీ లేదు. ఇవన్నీ ఈ గ్లామర్ ప్రపంచంలో అర్థం చేసుకుని ముందుకు వెళ్లాల్సిందేనని తన వారసులకు ఆయన నూరిపోసారు. కాబట్టి ఇప్పుడు చెడును ప్రచారం చేసిన యూట్యూబ్ చానెళ్లను పట్టించుకుంటారా? అన్నది కూడా సందేహమే.