కింగ్ నాగార్జున ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చినా కూడా కమర్షియల్ గా మాత్రం నిరాశ పర్చింది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయడంతో పాటు బంగార్రాజు సినిమాను కూడా పట్టాలెక్కించాడనే సమాచారం అందుతోంది. ఈ సమయంలోనే నాగార్జున మరో సినిమాకు సిద్దం అయ్యాడని.. అది కూడా మన్మధుడు 2 సినిమా కు దర్శకత్వం వహించిన రాహుల్ రవీంద్రతో అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు ప్రస్తుతం అక్కినేని అభిమానులకు భయంను కలిగిస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన మన్మధుడు 2 డిజాస్టర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. అలాంటిది మళ్లీ సినిమా అంటూ నోరు వెళ్లబోతున్నాడు.
రాహుల్ రవీంద్రతో నాగార్జున సినిమా నిజమే కాని అభిమానులు భయపడాల్సిన విషయం ఇందులో ఏమీ లేదట. ఎందుకంటే రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో నాగార్జున సినిమా ను నిర్మించబోతున్నాడు తప్ప అందులో నటించబోవడం లేదు. నాగార్జున మాత్రమే కాదు ఏ అక్కినేని హీరో కూడా ఆ సినిమాలో కనిపించబోవడం లేదు. చిన్న బడ్జెట్ తో చి.ల.సౌ వంటి విభిన్నమైన కాన్సెప్ట్ తో అంతా కొత్త వారితో రాహుల్ రవీంద్ర సినిమాను తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ సిద్దం చేశాడట.
మన్మధుడు 2 తో నాగార్జునకు రాహుల్ చాలా నష్టంను కలిగించాడు. ఇప్పుడు ఆ నష్టంను ఈ చిన్న సినిమాతో భర్తీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చాలా కొత్త పాయింట్ తో ఈ సినిమాను దర్శకుడు రాహుల్ రూపొందించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రటక అతి త్వరలోనే వెళ్లడయ్యే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సినిమా విషయంలో అక్కినేని ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన పనేం లేదు.