శ్రీమంతుడి వైఫ్ కాపీ మెసేజ్ ఇస్తే ఎలా?

Update: 2015-12-08 11:57 GMT
చెన్నై వరదలు ప్రతీ ఒక్కరినీ కదిలించాయి. ముఖ్యంగా అక్కడే ప్రాణం పోసుకున్న టాలీవుడ్ జనాలకు.. చైన్నై కష్టం చూసి కదిలిపోయింది. వీలైనంతవరకూ, తమకు తోచినట్లుగా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. విరాళాలు రూపంలో - ఆహార పొట్లాలు - వాటర్ ప్యాకెట్లు - మందుల రూపంలో సాయం చేసేందుకు కేంపెయిన్ చేస్తున్నారు. అయితే.. సూపర్ స్టార్ మహేష్ పది లక్షల రూపాయల విరాళం ప్రకటించగా.. ఇప్పుడు ఆయన భార్య స్పందన అందరినీ ఆకట్టుకుంటోంది.

"జీవితం అంటే డబ్బు సంపాదన కాదు. ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ బతకడం. మీ దగ్గర ఏటీఎం కార్డ్ ఉంది, కానీ ఏటీఎం లేదు. మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది కానీ ఛార్జింగ్ లేదు. ఇల్లుంది కానీ అందులో జీవించే అవకాశం లేదు, కారు బైక్ ఉన్నా డ్రైవింగ్ చేసే అవకాశం లేదు. అదే జీవితం అంటే. ఒకరికి ఒకరు సాయం చేసుకోండి.. కలిసి ఎదగండి" అంటూ నమ్రత చేసిన ట్వీట్ బాగా ఆకట్టుకుంటోంది. నిజానికి ఈ ట్వీట్ ఆమె సొంతమేమీ కాదనే విషయం నెటిజన్లకు బాగానే తెలుసు. కొన్ని రోజులుగా ఈ మెసేజ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో బాగానే తిరుగుతోంది. దాన్ని ఆమె కాపీ చేసేసి.. తన మెసేజ్ రూపంలో పోస్ట్ చేసేసిందంతే.

జనాలకు ఏదైనా చెప్పాలనే తపన బాగానే ఉంది. ఆ విషయంలో అభినందించాలి కానీ.. సెలబ్రిటీ నుంచి అంటే, సంథింగ్ డిఫరెంట్ గా ఏదైనా సొంతంగా ఏదైనా చెబ్తారేమో అని ఎదురుచూస్తారు జనాలు. కానీ మాజీ మిస్ ఇండియా కం మహేష్ భార్య నమ్రత కాపీ మెసేజ్ తో సరిపెట్టేసింది. కానీ.. ఆమె చెప్పాలనుకున్న విషయం మాత్రం అందరూ ఆలోచించాల్సినదే అనడంలో సందేహం అక్కర్లేదు.
Tags:    

Similar News