బాల‌య్య చుట్టూ భ‌జ‌న బృందంలో ఎవ‌రెవ‌రు?

Update: 2020-05-18 06:30 GMT
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం కెరీర్ 106వ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `సింహా`.. `లెజెండ్‌` వంటి బ్లాక్‌ బస్టర్స్ ని అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. ఇటీవలే ఆర్.ఎఫ్.సీలో షూటింగ్ చేశారు. కరోనా లాక్ డౌన్ తో నెక్ట్స్ షెడ్యూల్‌ వాయిదా పడింది.  ఇందులో అంజలి.. శ్రియా కథానాయికలుగా నటిస్తున్నారు. మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా త‌ర్వాత వెట‌రన్ డైరెక్ట‌ర్ బి.గోపాల్ కి బాల‌య్య ఛాన్సిచ్చార‌ని ప్ర‌చారం సాగుతోంది.  `సమరసింహారెడ్డి`.. `నరసింహనాయుడు` వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను త‌న‌కు అందించిన బి.గోపాల్ ని కాద‌న‌లేక‌పోయార‌ని తెలుస్తోంది. ఈ ఔట్ డేటెడ్‌ దర్శకుడితో సినిమా చేయడంపై ఓ వైపు విమర్శలు వినిపిస్తున్నా ఛాన్స్ అయితే ఉందిట‌. అదంతా స‌రే కానీ.. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ మ‌రో రీమేక్ మూవీలో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

గ‌త కొంత‌కాలంగా మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్య‌ప్ప‌న్ కొరివియాన్ రీమేక్ లో ఎన్.బీ.కే న‌టించనున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అయితే ఇది క‌న్ఫామ్ అయ్యిందా లేదా? ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అంటే ఎలాంటి క్లారిటీ రాలేదు. ``లాక్ డౌన్ అయ్యాక ప్రివ్యూ చూసి అప్పుడు నిర్ణ‌య‌మేమిటో చెబుతానని నట సింహ బాలకృష్ణ అన్నార‌ట‌. అంటే ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న మూవీని చూడ‌నే లేదు. అలాగే బాల‌య్య సినిమా అంటే డైరెక్ట‌ర్ ఎవ‌రో కూడా ఆయ‌నే చెప్పాలి కాబ‌ట్టి ఛాన్స్ బి.గోపాల్ కే వెళుతుందా? అన్న చ‌ర్చా సాగుతోంది. లేదూ బి.గోపాల్ ఆయ‌న సొంత స్క్రిప్టుతో రెడీ అయితే.. ఈ సినిమాని ఎవ‌రైనా యువ‌ద‌ర్శ‌కుడికి అప్ప‌జెబుతారా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం బాల‌య్య‌ను ఇంప్రెస్ చేసేందుకు వెట‌ర‌న్ బి.గోపాల్ తో పాటు ప‌లువురు దర్శ‌కులు క్యూ క‌ట్టార‌ట‌. ఇక ఎవ‌రికి వారు భ‌జ‌న చేస్తూ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ వెయిట్ చేస్తున్నార‌ని స‌మాచారం.
Tags:    

Similar News