యాక్సిడెంట్‌ పై అనుమానాలు!?

Update: 2018-08-29 03:57 GMT
నేటి వేకువ ఝామున నంద‌మూరి హ‌రికృష్ణ కార్ యాక్సిడెంట్‌లో మ‌ర‌ణించార‌న్న వార్త ప్ర‌కంప‌నాలు సృష్టించింది. నిన్న‌నే ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావ్ ఓ పెను ప్ర‌మాదం నుంచి ఎస్కేప్ అయ్యార‌న్న వార్త‌ను ఇంకా అభిమానులు జీర్ణించుకోక ముందే - వేరొక సెల‌బ్రిటీ హ‌రికృష్ణ ఆక‌స్మికంగా ఇలా యాక్సిడెంట్‌ లో దుర్మ‌ర‌ణం పాలవ్వడంతో టాలీవుడ్ స‌హా రాజ‌కీయ‌వ‌ర్గాల్లో పెను విషాదం అలుముకుంది. ఈ యాక్సిడెంట్ వెనక ఏవైనా సందేహాలు - అనుమానాలు ఉన్నాయా? అంటూ ప‌రిశ్ర‌మ‌లో ఆరాలు మొద‌ల‌య్యాయి.

కొన్ని యాక్సిడెంట్‌ లు - మ‌ర‌ణాలు మిస్ట‌రీగానే మిగులుతాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ టీవీ చానెళ్లు అందించిన రిపోర్ట్ ప్ర‌కారం.. ఈ మ‌ర‌ణంలో మిస్ట‌రీ ఏం క‌నిపించ‌డం లేదు. హైవేలో అత్యంత వేగంగా వెళుతున్న హ‌రికృష్ణ‌ కార్ .. వేరొక కార్‌ని ఓవ‌ర్ టేక్ చేయాల‌ని ప్ర‌య‌త్నించ‌డం వ‌ల్ల‌నే ఈ ప్ర‌మాదం సంభ‌వించింద‌ని భావిస్తున్నారు. కార్ 80-100 స్పీడ్‌ లో వెళుతూ డివైడ‌ర్‌ ని ఢీకొట్ట‌డంతో గాల్లో అంతెత్తున ఎగిరిప‌డింది. ఆ టైమ్‌ లో బెలూన్ తెరుచుకుందా.. లేదా? అన్న‌ది స‌స్పెన్స్. ఇక ఇదే కార్‌ లో ప్ర‌యాణిస్తున్న రావి వెంక‌ట్రావ్‌ - శివాజీ బ‌తికి బ‌య‌ట‌ప‌డ‌డం అదృష్టం అనే చెప్పాలి.

ఇదివ‌ర‌కూ ఇదే విజ‌య‌వాడ హైవేలోనే హ‌రికృష్ణ త‌న‌యుడు నంద‌మూరి జాన‌కిరామ్ కార్ భారీ ప్ర‌మాదానికి గురై మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. అదే హైవేలో తండ్రి హ‌రికృష్ణ మృతి చెంద‌డం యాధృచ్ఛిక‌మే అయినా అభిమానుల్లో మాత్రం సెంటిమెంటుగా ఈ హైవే గురించి చర్చ సాగుతోంది. నంద‌మూరి కుటుంబాన్ని ఇలా రోడ్ యాక్సిడెంట్ల రూపంలో ప్ర‌మాదాలు వెంటాడ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.
Tags:    

Similar News