నందమూరి బాలకృష్ణ ఏకైక వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులు ఎదురుచూసే కొద్దీ ఆలస్యం జరుగుతూనే ఉంది. అదుగో ఇదుగో అనడమే తప్ప బాలయ్య నట వారసుడి లాంచ్ ఎప్పుడు అనేది మాత్రం చెప్పడం లేదు. ఈలోగా ఫిలిం నగర్ వేదికగా రకరకాల గాసిప్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. అసలు మోక్షజ్ఞకు సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేదని బిజినెస్ వైపే మొగ్గు చూపుతున్నాడని ఇలా ఏదేదో చర్చకు వస్తోంది.
బాలయ్య ఫ్యాన్స్ మాత్రం వీటిని ఖండిస్తున్నారు. తమ హీరోను కలిసిన ప్రతిసారి మోక్షజ్ఞ గురించి అడుగుతున్నామని సరైన సమయం కథ దర్శకుడు దొరికినప్పుడు అందరికి చెప్పి గ్రాండ్ గా లాంచ్ చేస్తానని అప్పటిదాకా కాస్త ఓపిగ్గా వెయిట్ చేయమని చెప్పారని నొక్కి వక్కనిస్తున్నారు. ఇదిలా ఉండగా టాలీవుడ్ మూల స్థంబాలుగా చెప్పుకునే నలుగురు హీరోల్లో చిరంజీవి వారసుడు రామ్ చరణ్ ఇప్పటికే సెటిల్ అయిపోయాడు. రంగస్థలంతో తన స్థానాన్ని సుస్థిరపర్చుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాడు.
నాగార్జున ఇద్దరు పిల్లలు నాగ చైతన్య అఖిల్ ఆల్రెడీ ఫీల్డ్ లో పోరాడుతున్నారు. వెంకటేష్ అబ్బాయి వయసురిత్యా రావడానికి ఇంకా టైం పడుతుంది. మిగిలింది బాలయ్య అబ్బాయి మోక్షజ్ఞే. అందుకే బయటికి కనిపించని ఒత్తిడితో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చర్చలైతే జరుగుతున్నాయట. మూడేళ్ళ క్రితం సాయి కొర్రపాటి నేనే మొదటి సినిమా తీస్తానని ప్రకటించారు కాని ఆ తర్వాత ఆయనా ఎక్కడా దాని ఊసు ఎత్తడం లేదు. ఈ సస్పెన్స్ వచ్చే ఏడాదికైనా వీడుతుందో లేదో బాలయ్య చెప్తే కాని చిక్కుముడి వీడదు