మొదటి నుంచి కూడా కల్యాణ్ రామ్ ఒక వైపున హీరోగా చేస్తూనే .. మరో వైపున నిర్మాతగాను ముందుకు వెళుతున్నాడు. హీరోగా .. నిర్మాతగా ఆయనకి లభించిన సక్సెస్ లు చాలా తక్కువ . అయినా సినిమాల పట్ల గల ప్రేమతో కొత్త కథలను .. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ పట్టుదలతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. అడపా దడపా దొరుకుతున్న విజయాలనే ఆసరాగా చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ సారి ఆయన మరింత పెద్ద సాహసమే చేశాడు.
ఇంతవరకూ సోషల్ మూవీస్ మాత్రమే చేస్తూ వచ్చిన ఆయన, మొదటిసారిగా చారిత్రక అంశంతో ముడిపడిన కథను ఎంచుకున్నాడు. 'బాంబిసార' అనే సినిమాను నిర్మించాడు. చరిత్రకీ .. వర్తమానానికి ముడిపడిన కథ ఇది.
ఈ సినిమాలో ఆయన రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు. మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేథరిన్ .. సంయుక్త మీనన్ కథానాయికలుగా అలరించనున్నారు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా, చైతన్ భరద్వాజ్ బాణీలను సమకూర్చారు. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్ సినిమా దిశగా తాను వేసిన తొలి అడుగులను గుర్తుచేసుకున్నారు. "నాకు బాగా గుర్తు 1989లో నేను సెవెంత్ క్లాస్ చదువుతుండగా బాబాయ్ మా ఇంటికి వచ్చారు. "అన్నయ్యా .. కల్యాణ్ ను సినిమాలకి పరిచయం చేస్తాను .. ఒక చైల్డ్ కేరక్టర్ ఉంది" అన్నారు. చదువుకుంటున్న వయసులో ఇప్పుడు అవసరమా అన్నట్టుగా నాన్నగారు అంటే, అవన్నీ నేను చూసుకుంటానులే .. మీరు వర్రీ కానవసరం లేదు అని బాబాయ్ అన్నారు. అప్పటివరకూ నాకు సినిమాలో చేయడం తెలియదు.
సినిమాలలో నటన పరంగా నాకు అక్షరాభ్యాసం చేయించింది మా బాబాయ్ నే .. ఆ సినిమానే 'బాల గోపాలుడు'. మొదటిసారి కెమెరాముందుకు వెళ్లినప్పుడు ఏం చేయాలి? .. ఎలా చేయాలి? అనేది ఏమీ తెలియదు. అలా నా సినిమా జీవితం ఆ సినిమాతో మొదలైంది. 'తొలిచూపులోనే' సినిమాతో హీరోగా నా ప్రస్థానం మొదలైంది. ఆ సినిమా బాగా ఆడకపోవడంతో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి? అనుకున్నాను. బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని 'అతనొక్కడే' చేశాను.
'ఓం' అనే సినిమా ద్వారా త్ర్రీడీ టెక్నాలజీని తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చాను. 'ఓం' సినిమా నాకు నిరాశనే మిగిల్చింది. 'బాహుబలి' తరువాత సినిమా మేకింగ్ అనేది మారిపోయింది. పాండమిక్ తరువాత జనాలు మళ్లీ థియేటర్స్ కి వస్తారా లేదా అనే టెన్షన్ లో ఉన్నప్పుడు 'ఆర్ ఆర్ ఆర్' అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ .. చరణ్ గొప్పగా చేశారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏమిటనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం" అంటూ ముగించాడు.