హీరోయిన్ అంటే అలా చేయాల్సిందేనా..? : నందిత

Update: 2021-01-30 13:30 GMT
ఏ సినిమాకైనా కథ ప్రధానమని, బలమైన కథతో తీసిన సినిమాలు పాటలు లేకపోయినా మంచి ప్రేక్షకాదరణ పొందాయని అన్నారు నటి నందిత. తాజాగా విడుదలైన ఆమె చిత్రం గురించి స్పందించిన నందిత.. పై విధంగా వ్యాఖ్యానించారు. సినిమాలో హీరోతో కలిసి డ్యూయట్‌ సాంగ్‌ చేస్తేనే హీరోయిన్ అవుతారా? అని ప్రశ్నిస్తోంది.

నందితా శ్వేత హీరోయిన్‌గా, యువ నటుడు సీబీ సత్యరాజ్‌ హీరోగా నటించిన చిత్రం ‘కబడదారి’. ఈ నెల 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఇందులో నందితా శ్వేత హీరోయిన్‌ అయినప్పటికీ ఒక్క డ్యూయట్‌ సాంగ్‌, ప్రేమసన్నివేశం కూడా లేదు ఈ సినిమాలో. దీంతో.. ఈ చిత్రాన్ని చూసిన వారు ఈ మూవీలో ఆమె హీరోయిన్‌ కానే కాదంటున్నారు.

ఈ విషయాన్ని నందిత వద్ద ప్రస్తావించగా.. ‘ఈ చిత్రంలో నటించే ఛాన్స్‌ లభించగానే కన్నడ మాతృక చిత్రాన్ని చూశాను. ఇందులో నా పాత్ర చాలా బనమైనది, కీలకమైనదిగా భావించాను. అందుకే అంగీకరించాను.’ అని చెప్పారు. అంతేకాదు.. ప్రేక్షకులు సినిమాలు చూసే దృష్టి కూడా మారాలని సూచించారు.

‘హీరోయిన్‌ అంటే హీరోతో కలిసి డ్యూయట్‌ సాంగ్‌ చేయాలి, సినిమా మొత్తం కనిపించాలి అనే భావన మారాలి. గతంలో నేను నటించిన చిత్రాల్లో కథలో నా పాత్రను మాత్రమే చూసేదాన్ని.. కానీ, ఇకపై చిత్ర కథను మాత్రమే చూస్తాను. ఒక చిత్రానికి బలమైన కథే హీరో అని నేను బలంగా నమ్ముతాను’ అని చెప్పుకొచ్చింది నందితా శ్వేత.
Tags:    

Similar News