'గేమ్ ఛేంజర్' కోసం శంకర్ డే అండ్ నైట్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ముగించుకుని శంకర్ అండ్ కో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. మరోవైపు ప్రచారం పనులు మొదలయ్యాయి. రిలీజ్ కి ఇంకా నలభై రోజులే సమయం ఉండటంతో టీమ్ అంతా హడావుడిగా పనిచేస్తుంది. ఇటీవలే రిలీజ్ అయిన పాటలకు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
టీమ్ అంతా అప్పుప్పుడు సోషల్ మీడియాలో ద్వారా టచ్ లో కి వచ్చినా? శంకర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. తాజాగా ఆయన బిజీ షెడ్యూల్ ఎంత టైట్ గా ఉందన్నది బయటకు వచ్చింది. ప్రస్తుతం డే అండ్ నైట్ శంకర్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనే తలమునకలై ఉన్నారు. ఇటీవలే సినిమా ఫైనల్ ఎడిట్ పై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. సినిమాని వీలైనంత వరకూ షార్ప్ గాచూపించే ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు.
దీనిలో భాగంగా ల్యాగ్ పై దృష్టి పెట్టి పని చేస్తున్నారుట. అనవసరమైన సన్నివేశాలన్నింటిని ఎడిట్ చేయిస్తు న్నారుట. ఎడిటర్ తో కలిసి తాను కూడా కంటున్యూగా స్టూడియోలోనే ఉంటున్నారుట. ఇండియన్ -2 ఎడిటింగ్ విషయంలో కొన్ని విమర్శలొచ్చాయి. సినిమా ల్యాగ్ ఉందనే విమర్శ ఎదుర్కుంది. దీంతో `గేమ్ ఛేంజర్` లో అలాంటి విమర్శకు ఎక్కడా తావు ఇవ్వకుండా శంకర్ పనిచేస్తున్నారు.
`గేమ్ ఛేంజర్` కు ఎడిటర్లుగా షమీర్ మహ్మద్, రూబీన్ పనిచేస్తున్నారు. షమీర్ ఎక్కువగా మలయాళం, తమిళ సినిమాలకు పని చేసారు. రూబీన్ కోలీవుడ్ చిత్రాలకు పనిచేసారు. కొన్ని తెలుగు సినిమాలకు కూడా రూబీన్ పనిచేసారు. ఇప్పుడా టీమ్ తో నే శంకర్ ఎడిటింగ్ రూమ్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.