నేచురల్ స్టార్ నాని ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టకముందే కొత్త కబురు చెబుతానని రెండు రోజుల ముందే రివీల్ చేసాడు. తాజాగా తన ల్యాండ్ మార్క్ 30వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కోసం వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ తో జతకడుతున్నాడు. మోహన్ చెరుకూరి - డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల - మూర్తికె.ఎస్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
న్యూ ఇయర్ సందర్భంగా ఒక వీడియోను విడుదల చేసారు. నాని తన తదుపరి ప్రాజెక్ట్ గురించి తన ఆన్-స్క్రీన్ కుమార్తెతో చర్చిస్తున్నప్పుడు నాని ఒక భవనం పైన కూర్చుని ఫోటోలు క్లిక్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. `దసరా` కోసం పెంచిన మీసాలతో పాటు గడ్డం కూడా షేవ్ చేస్తానని అంటాడు నాని. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని- తండ్రీకూతుళ్ల బాండింగ్ హైలైట్ గా ఉండబోతోందనే భావనను ఈ వీడియో తీసుకొస్తుంది.
ఈ క్రమంలోనే దర్శకుడితో పాటు చిత్రానికి సంబంధించిన ప్రధాన సాంకేతిక నిపుణులను ప్రకటించారు. శౌర్యువ్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఓ చిన్న వీడియోతో భావోద్వేగానికి గురిచేశాడు. ఇది దర్శకుడిపై పాజిటివ్ ఇంప్రెషన్ గా చెప్పొచ్చు. `సీతా రామం` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ ఇందులో నానికి జోడీగా నటిస్తుంది.
ఈ చిత్రంలో కొంతమంది యువకులు - ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు విభిన్నమైన క్రాప్ట్ ల్లో పని చేస్తారు. సాను జాన్ వరుగీస్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇతనికిది నానితో మూడవ చితం. గతంలో ` జెర్సీ` -` శ్యామ్ సింఘ రాయ్` చిత్రాలకు పనిచేసాడు. ఆ పనితనం మెచ్చే నాని అండ్ కో మరుసారి కెమెరా బాధ్యతలు అప్పగించారు.
ప్రముఖ మలయాళ సంగీత దరశకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఇప్పటికే ఓ వీడియో కోసం క్రియేట్ చేసిన అతని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగీత ప్రియుల్ని అలరించింది. ప్రవీణ్ ఆంథోని ఎడిటింగ్.. సతీష్ EVV ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు.