నాని ఇంటా బైటా దుమ్ము దులిపేశాడు. ఓవర్సీస్ లోనూ కింగ్ అని నిరూపించాడు. భలే భలే మగాడివోయ్ అమెరికాలో బ్లాక్ బస్టర్ హిట్. నవతరం హీరోల్లో మీడియం బడ్జెట్ సినిమాతో విదేశాల్లో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన ఏకైక హీరోగా రికార్డులకెక్కాడు. ఒక్క అమెరికా బాక్సాఫీస్ వద్ద ఒక మిలియన్ డాలర్ వసూళ్లు కురిపించాడంటే ఇక నాని నిజంగానే మొనగాడి కిందే లెక్క.
ఇటీవలే యూఎస్ బాక్సాఫీస్ నుంచి వచ్చిన లెక్కల వివరాల ప్రకాం... మంగళవారం 39, 487 డాలర్లు, బుధవారం 30,808 డాలర్లు, గురువారం 21,541 డాలర్లు వసూలైంది. ఇప్పటికి మొత్తం 9లక్షల 61వేల 12 డాలర్లు సంపాదించాడు... ఇది రెంట్రాక్ సంస్థ తెలిపిన లెక్కలు. అయితే అమెరికాలోని సినిమా డిస్ర్టిబ్యూటర్ చెబుతున్న లెక్కల ప్రకారం.. భలే భలే మగాడివోయ్ ఏకంగా 1 మిలియన్ డాలర్ మార్కును క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. ఆ అతి పెద్ద సంఖ్యను కొట్టడమంటే అంత మామూలు విషయం కాదు మరి.
అల్లు అరవింద్ సమర్పణలో జిఎ2 పిక్చర్స్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ చిత్రాన్ని మారుతి దర్శకత్వం వహించాడు. ఈ ఒక్క సినిమాతో ఇటు నానీ, అటు మారుతి భలే భలే మగాళ్లయిపోయారు. అమెరికాలో ఉండే తెలుగోళ్లందరూ పిచ్చిగా అభిమానించే లెవల్ కి ఎదిగారు. అది సంగతి.