గ్యాంగ్ లీడర్ రచ్చ రకరకాలుగా నానుతూనే ఉంది. నానికి చిరంజీవి కల్ట్ క్లాసిక్ టైటిల్ ఎలా వాడుకుంటారని మెగా ఫ్యాన్స్ లో ఇప్పటికీ అసంతృప్తి అలాగే ఉంది. ఇది చాలదు అన్నట్టు ఆ టైటిల్ నాదని ఇంతకు ముందే రిజిస్టర్ చేయించానని త్వరలో షూటింగ్ కూడా మొదలుపెడతానని ఓ చిన్న నిర్మాత బయటికి రావడంతో వ్యవహారం కాస్తా ఫిలిం నగర్ ఛాంబర్ కు చేరింది. పరిష్కారం ఏమొస్తుంది అనేది పక్కన పెడితే చిరు అభిమానులు మాత్రం నానినే కాదు ఎవరూ గ్యాంగ్ లీడర్ వాడుకోవడానికి వీలు లేదనే మాట మీదున్నారు.
దీని మీద సోషల్ మీడియా చర్చ కొనసాగుతూనే ఉంది. న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ ఇప్పుడో కొత్త వెర్షన్ తో రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. గతంలో అల్లరి నరేష్ హీరోగా యముడికి మొగుడు అనే సినిమా వచ్చింది. ఇది కూడా చిరు ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ టైటిల్స్ లో ఒకటి. అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. అది డిజాస్టర్ అయ్యింది. హాస్య చిత్రాల హీరో అయిన అల్లరి నరేష్ వాడుకుంటే కనిపించలేదు కానీ ఇప్పుడు నానిది మాత్రమే ఎందుకు హై లైట్ అవుతోందనేది వాళ్ళ ప్రశ్న.
అంతేకాదు చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సైతం విజేతను వాడుకున్నప్పుడు ఎవరూ అడ్డుచెప్పలేదని ఒక్క నానిని మాత్రమే ఇంతగా టార్గెట్ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదైతేనేం చల్లారింది అనుకున్న గ్యాంగ్ లీడర్ వివాదం రెండు రకాలుగా మళ్ళి మొదటికే వచ్చింది. సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా నాని సైలెంట్ గా ఉన్నాడు. బిగ్ బాస్ షో జరుగుతున్నప్పుడు వీటి ప్రభావం ఎలా ఉంటుందో గమనించాడు కాబట్టి మౌనాన్ని ఆశ్రయించడం ఉత్తమమని భావించాడు కాబోలు