నాని హిట్ సినిమా.. టీవీలో కూడా డిజాస్టర్!

Update: 2022-10-13 10:33 GMT
నేచురల్ స్టార్ నాని ఒకప్పుడు ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద అయితే మినిమం కలెక్షన్స్ అందుకునేవి. అతనికి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ బాగా ఉండటంతో మొదటి వారమే పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేది. ఆ విధంగా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంటూ వచ్చిన నాని ఇటీవల కాలంలో మాత్రం బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడిని పూర్తిస్థాయిలో అందుకోవడం లేదు.

ఎంతమంది దర్శకులను మారుస్తున్నా అలాగే ఆడియన్స్ కున్న కు నచ్చేలా కామెడీ సినిమాలు చేస్తున్నా కూడా వర్కౌట్ కావడం లేదు. నాని నుంచి భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత మళ్లీ అలాంటి కామెడీ సినిమా చూడలేదు అని చాలామంది కోరుకున్నారు అనే భావనతో 'అంటే సుందరానికి' అనే సినిమా చేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందు హడావిడి గానే కనిపించింది.

అలాగే విడుదలైన రోజు కూడా సినిమాకు రివ్యూలు కూడా చాలా బాగా వచ్చాయి. అటు ఇటుగా చేసి సినిమా హిట్ అని కూడా సంబరాలు చేసుకున్నారు. కానీ తీరా చూస్తే సినిమా కలెక్షన్స్ రెండు రోజుల తర్వాత ఒకసారిగా తగ్గుముఖం పట్టాయి.

సినిమా పాటలు సినిమాపై కొత్త హైక్ కూడా క్రియేట్ చేయలేదు. ఇక కామెడీ సీన్లు అయితే రొటీన్ గానే ఉన్నాయి అనే భావన కూడా చాలా మందిలో వచ్చింది.

ఇక ఈ సినిమాకు ఓటిటిలో చాలామంది చూశారు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ టీవీలో మాత్రం దారుణమైన రెస్పాన్స్ అందుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. నాని సినిమా అంటే టెలివిజన్ ప్రీమియర్స్ కు మినిమం 10 రేటింగ్ అయినా వస్తుంది.

కానీ ఈసారి అంటే సుందరానికి సినిమా జెమినీ టీవీలో మొదటిసారి టెలికాస్ట్ కాగా కేవలం 1.88 రేటింగ్ మాత్రమే వచ్చింది. దీన్ని బట్టి సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక విధంగా ఓటీటీ ప్రభావం అనేది గట్టి ప్రభావం చూపుతుందని కూడా అనిపిస్తోంది. నాని సినిమాకు ఇలాంటి రేటింగ్స్ రావడం అనేది పెద్ద షాక్ తినే చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News