రాజమౌళి రేంజ్ చూపించేస్తున్న నాని!!

Update: 2017-02-04 09:34 GMT
హీరో నాని లేటెస్ట్ మూవీ నేను లోకల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్ సహా అన్ని ఏరియాల్లోనూ ఇరగదీసి ఆడేస్తోంది నేను లోకల్. నాని నటించిన చివరి చిత్రం మజ్నుతో పోల్చితే.. దాదాపు రెట్టింపు కలెక్షన్స్ వస్తున్నాయంటే.. నేను లోకల్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఏర్పడిందో అర్ధం చేసుకోవచ్చు.

నాని హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ.. ఇప్పటివరకూ నాని మూవీస్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం. ఇప్పుడు దాదాపుగా ఈగకు సరి సమానంగా నేను లోకల్ కలెక్షన్స్ వస్తున్నాయి. గుంటూరు.. ఈస్ట్.. వెస్ట్ లలో అయితే.. ఈగకు మించి వసూళ్లు సాధించేశాడు లోకల్ నాని. నైజాంలో ఈగకు తొలి రోజున 1.62 కోట్ల షేర్ వస్తే.. నేను లోకల్ 1.56 కోట్లు వసూలు చేసింది. సీడెడ్ లో ఈగకు కోటి.. నేను లోకల్ కు 55 లక్షలు వచ్చాయి. ఉత్తరాంధ్రలో అయితే ఈగకు 30 లక్షల షేర్ మొదటి రోజున వస్తే.. నేను లోకల్ ఏకంగా 51 లక్షలు వసూలు చేయడం విశేషం.

మొత్తంగా మొదటి రోజున ఈగ మూవీకి 4.60 కోట్ల వసూళ్లు రాగా.. నాని గతచిత్రం మజ్నుకు కేవలం 2.44 కోట్లు మాత్రమే వసూళ్లు దక్కాయి. నేచురల్ స్టార్ లేటెస్ట్ మూవీ నేను లోకల్ కి.. 4.35 కోట్లు రాబట్టి దాదాపుగా రాజమౌళితో చేసిన సినిమాతో సమానంగా కలెక్షన్స్ సాధించాడు నాని. స్టార్ స్టేటస్ ను నాని ఎప్పుడో పట్టేశాడని అనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏదైనా కావాలా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News