బాబు లోక‌ల్‌.. హిట్ యూనివ‌ర్శ‌ల్

Update: 2017-02-03 17:30 GMT
ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. ‘నేను లోక‌ల్’ ఫ‌లిత‌మేంటో తేలిపోయింది. నాని డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టేసిన‌ట్లే. శుక్ర‌వారం మంచి అంచ‌నాల మ‌ధ్య రిలీజైన ఈ సినిమా ఆ అంచ‌నాన్ని అందుకుంది. పాజిటివ్ టాక్ తో మొద‌లై.. బంప‌ర్ ఓపెనింగ్స్ తో అద‌ర‌గొడుతోంది నాని కొత్త సినిమా. కంటెంట్ కొంచెం రొటీనే అయినా.. ఎంట‌ర్టైన్మెంట్ వ‌ర్క‌వుటైపోవ‌డంతో యునాన‌మ‌స్ పాజిటివ్ టాక్ వ‌స్తోంది ఈ సినిమాకు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో.. అటు అమెరికాలో ఈ సినిమా హౌస్ ఫుల్స్ తో హోరెత్తిస్తోంది. మాస్.. క్లాస్ అని లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి ఈ సినిమాకు మంచి స్పంద‌న వ‌స్తోంది. సినిమా హిట్ అన‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని సాయంత్రానికి క్లారిటీ వ‌చ్చేసింది.

సంక్రాంతి సినిమాల జోరు త‌గ్గిపోతున్న వేళ మంచి టైమింగ్ లో రిలీజ‌వ‌డం ‘నేను లోక‌ల్‌’కు క‌లిసొచ్చే అంశం. ఈ నేప‌థ్యంలో థియేట‌ర్ల ద‌గ్గ‌ర స్పంద‌న అంచ‌నాల్ని మించి పోతోంది. స్టార్ హీరోల సినిమాల‌కు క‌నిపించిన‌ట్లు థియేట‌ర్ల ద‌గ్గ‌ర క్రౌడ్ క‌నిపిస్తోంది. త‌ర్వాతి షోల‌కు కూడా ముందే బుకింగ్స్ జోరుగా అయిపోతున్నాయి. ఇటు మ‌ల్టీప్లెక్సులు.. అటు సింగిల్ స్క్రీన్లు.. రెండు చోట్లా నాని హ‌వా క‌నిపిస్తోంది. సినిమాకు మ‌హ‌రాజ పోష‌కులైన యువ‌త‌కు సినిమా బాగా న‌చ్చేస్తుండ‌టం పెద్ద ప్ల‌స్. ఈ రోజుల్లో ప్రేక్ష‌కుల‌కు ఎంట‌ర్టైన్మెంట్ ఇవ్వ‌డం అన్నిటికంటే కీల‌కం. ఆ విష‌యంలో ఢోకా లేక‌పోవ‌డం.. అనేక ఆక‌ర్ష‌ణ‌లు తోడ‌వ‌డంతో నేను లోక‌ల్ పెద్ద హిట్ట‌య్యేలా క‌నిపిస్తోంది. సినిమాకు వ‌చ్చిన టాక్ చూసుకుని సాయంత్రానికే దిల్ రాజు త‌న‌దైన శైలిలో ప్రమోష‌న్ మొద‌లుపెట్టేశాడు. ‘బాబు లోక‌ల్‌.. హిట్ యూనివ‌ర్శ‌ల్ అనే స్లోగ‌న్ తో పోస్ట‌ర్లు వ‌దిలేశాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News