ఎలాగైతేనేం నాని సాధించేశాడు. అతడి కొత్త సినిమా ‘నేను లోకల్’ అన్ని సందేహాల్ని పటాపంచలు చేస్తూ అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్బులోకి అడుగుపెట్టేసింది. నాని కాన్ఫిడెన్స్ మరీ ఓవర్ అయిపోయిందని.. ‘నేను లోకల్’కు అమెరికాలో పంచ్ పడటం ఖాయమని విడుదలకు ముందు కొందరు అంచనాలు కట్టారు. వీకెండ్లో జోరు చూపించినా.. ఆ తర్వాత నెమ్మదించడంతో మిలియన్ క్లబ్బును అందుకోవడం కష్టమని ఇంకొందరన్నారు. కానీ ఈ అంచనాలకు భిన్నంగా నాని సినిమా అదరగొట్టింది. సోమవారం నాటికి ఈ సినిమా అమెరికాలో మిలియన్ డాలర్ మార్కును టచ్ చేసింది.
‘నేను లోకల్’ వచ్చిన తర్వాతి వారం సినిమాలు ‘ఎస్-3’.. ‘ఓం నమో వేంకటేశాయ’ యుఎస్ బాక్సాఫీస్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ‘నేను లోకల్’ వసూళ్లకు.. వీటి వసూళ్లకు పెద్దగా తేడా ఏమీ లేదు. కొత్త చిత్రాలకు దీటుగా కలెక్షన్లు రాబట్టిన ‘నేను లోకల్’ నానిని ‘భలే భలే మగాగడివోయ్’ తర్వాత మళ్లీ మిలియన్ డాలర్ క్లబ్బులో నిలబెట్టింది. దాని కంటే ముందు ‘ఈగ’తోనూ నాని మిలియన్ డాలర్ ఘనతను అందుకున్నాడు. కానీ అది రాజమౌళి ఖాతాలోకి వెళ్తుంది. ‘భలే భలే..’ తర్వాత నాని చేసిన మూడు సినిమాలూ అమెరికాలో బాగానే ఆడాయి కానీ.. మిలియన్ డాలర్ మార్కును అందుకోలేకపోయాయి. ఐతే ‘నేను లోకల్’ మాత్రం అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకుని నానిని మళ్లీ ఆ క్లబ్బులోకి తీసుకెళ్లింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/