మార్చి అంటే అన్ సీజన్ అని.. కలెక్షన్లు అంతగా ఉండవని తెలుసు. కానీ ఈ నెలల వచ్చిన సినిమాల పరిస్థితి మరీ అన్యాయంగా ఉంది. ఇప్పుడున్న సినిమాకలు నామమాత్రపు వసూళ్లు కూడా లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం డజనుకు పైగా సినిమాలు థియేటర్లలో ఉండటం విశేషం. కానీ వాటిలో ఓ మోస్తరు వసూళ్లు సాధిస్తున్న సినిమాలు ఒకటీ అరానే. గత రెండు వారాంతాల్లో వచ్చిన సినిమాలేవీ కూడా బాక్సాఫీస్ దగ్గర నిలవలేకపోయాయి. వారాంతాల్లో సైతం వీటికి వసూళ్లు లేక థియేటర్లు కళ తప్పాయి. సింగిల్ స్క్రీన్లలో సైతం షోలను విభజించి రెండు సినిమాలు రన్ చేస్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండట్లేదు.
కొత్త సినిమాల పరిస్థితి దారుణంగా ఉండటంతో ఎప్పుడో యాభై రోజుల కిందట రిలీజైన నాని సినిమాను మళ్లీ రీప్లేస్ చేస్తున్న పరిస్థితి. ఈ నెల మొదటి వారంలో కిట్టు ఉన్నాడు జాగ్రత్త.. గుంటూరోడు.. ద్వారక లాంటి కాస్త క్రేజ్ ఉన్న సినిమాలు ఒకే రోజు రిలీజవడంతో నాని సినిమాను దాదాపుగా థియేటర్ల నుంచి ఖాళీ చేయించేశారు. కానీ వాటిలో ‘కిట్టు ఉన్నాడు..’ మినహా ఏదీ నిలవలేదు. ఇక ఆ తర్వాతి రెండు వారాల్లో వచ్చిన సినిమాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. దీంతో కొత్త సినిమాల్ని తీసేసి మళ్లీ నాని చిత్రాన్ని వేసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో దాదాపు పాతిక థియేటర్లలో ‘నేను లోకల్’ ఆడుతుండటం విశేషం. కొత్త సినిమాలతో పోలిస్తే దీనికే వసూళ్లు కూడా మెరుగ్గా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లో కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/