అఖిల్ తో పోటీపై నాని భలే చెప్పాడులే..

Update: 2017-11-28 16:28 GMT
మొత్తానికి నాని కొత్త సినిమా ‘ఎంసీఏ’ రిలీజ్ డేట్ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ సినిమా వారం ముందే వస్తుందని.. కాదు కాదు సంక్రాంతికి వాయిదా పడిందని కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. ఐతే అదేమీ లేదని.. ముందు చెప్పినట్లే డిసెంబరు 21న ‘ఎంసీఏ’ రిలీజవుతుందని‘జవాన్’ ప్రి రిలీజ్ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చేశాడు నిర్మాత దిల్ రాజు. అంతే కాదు.. మంగళవారం సాయంత్రానికి రిలీజ్ డేట్ పోస్టర్లు కూడా వదిలేశారు. దీంతో జనాలకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. దీంతో అఖిల్-నాని మధ్య బాక్సాఫీస్ పోరు చూడబోతున్నట్లే.

ఈ నేపథ్యంలో ‘ఎంసీఏ’ రిలీజ్ డేట్ పోస్టర్లను షేర్ చేస్తూ ట్విట్టర్లో ఒక వ్యక్తి నాని-అఖిల్ మధ్య వార్ జరగబోతోందని పేర్కొన్నారు. దీనిపై నాని స్పందించాడు. వార్ తనకు అఖిల్ కు కాదని.. తామిద్దరం కలిసి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో వార్ కు రెడీ అవుతున్నామని అన్నాడు. సల్మాన్ కొత్త సినిమా ‘టైగర్ జిందా హై’ కూడా క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానున్న నేపథ్యంలో నాని ఇలా స్పందించాడు. ‘‘మిడిల్ క్లాస్ అబ్బాయి ‘టైగర్’కు ‘హలో’ చెప్పబోతున్నాడు’ అంటూ మూడు సినిమాల పేర్లు కలిసొచ్చేలా తనదైన శైలిలో ఒక వ్యాఖ్య చేశాడు నాని. మొత్తానికి క్రిస్మస్ సీజన్లో మన సినీ ప్రేక్షకులు ఒక రసవత్తర బాక్సాఫీస్ పోరును చూడబోతున్నారన్నమాట.
Tags:    

Similar News