ప్రమోషన్స్ గ్యాప్ లో షూటింగ్

Update: 2020-03-02 19:30 GMT
ఒక వైపు తను నిర్మిస్తున్న సినిమా ప్రమోషన్ మరి వైపు షూటింగ్ ఆ తర్వాత తను కీ రోల్ చేసిన సినిమా రిలీజ్ ప్రమోషన్ ఇదీ ప్రస్తుతం నాని వర్క్. అవును అటు ప్రమోషన్స్ మధ్యలో జస్ట్ గ్యాప్ తీసుకొని ఓ షెడ్యుల్ పూర్తి చేసుకుంటున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇటివలే నాని నిర్మించిన హిట్ సినిమా ప్రమోషన్ లో పాల్గొని బజ్ తీసుకొచ్చాడు నాని. రిలీజ్ తర్వాత అంటే ఈరోజు వరకూ ఆ సినిమా ప్రమోషన్స్ లోనే బిజీగా ఉన్నాడు.

రేపటి నుండి రాజమండ్రిలో జరగనున్న తన నెక్స్ట్ సినిమా 'టక్ జగదీష్' షెడ్యుల్ లో పాల్గొనబోతున్నాడు. ఓ పదిహేను రోజుల పాటు ఈ షెడ్యుల్ జరగనుంది. మధ్యలో హిట్ కి సంబంధించి ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. వీలుంటే అది రాజమండ్రీలోనే పెట్టాలని భావిస్తున్నాడు నాని. ఇక 'టక్ జగదీష్' రాజమండ్రి షెడ్యుల్ పూర్తి చేసి 'V'ప్రమోషన్స్ లో పాల్గొంటాడు నాని.

నాని ఇరవై ఐదో సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఏవో స్పెషల్ ప్రమోషన్స్ ప్లానింగ్ జరుగుతుంది. సో రిలీజ్ కి ముందు నాని ఓ వారం పాటు ప్రమోషన్స్ కి డేట్స్ ఇవ్వనున్నాడు. రిలీజ్ తర్వాత మరో రెండు మూడు రోజులు కేటాయించి మళ్ళీ టక్ జగదీష్ షూటింగ్ లో పాల్గొంటాడు. ఇలా ప్రస్తుతం ప్రమోషన్స్ తో గడిపేస్తూ అటు నిర్మాతగా ఇటు హీరోగా బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు నాని.
   

Tags:    

Similar News