వచ్చే ఏడాది ఆరంభం నుంచి దాదాపు మూడు నెలల పాటు అగ్ర హీరోల చిత్రాలు వరుసగా రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి. పాన్ ఇండియా చిత్రాలన్ని వచ్చే జనవరిలో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఇంపాక్ట్ కొన్నాళ్ల పాటు ఉంటుంది. అటుపై సమ్మర్ హాలీడేస్ కోసం చాలా మంది బిగ్ స్టార్స్ క్యూ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మీడియం బడ్జెట్ చిత్రాలన్ని నవంబర్..డిసెంబర్ లోపు రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రధానంగా డిసెంబర్ ని పలువురు స్టార్లు టార్గెట్ చేసారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న `పుష్ప ది రైజింగ్` డిసెంబర్ రిలీజ్ ఖరారు అయినట్లే తెలుస్తోంది. డిసెంబర్ 17న `పుష్ప` పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పుష్ప రిలీజ్ అయి భారీ వసూళ్లు సాధిస్తే వాటికి టార్గెట్ గా కొత్త ఏడాది సినిమాలు బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇక డిసెంబర్ 24న మాస్ రాజా రవితేజ..నేచురల్ స్టార్ నాని వార్ కి రెడీ అయినట్లు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న `శ్యామ్ సింఘరాయ్` చిత్రాన్ని డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ తేదీని దృష్టిలో పెట్టుకుని ప్రచారం కార్యక్రమాలు మొదలు పెట్టారు. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ `శ్యామ్ సింఘరాయ్` రిలీజ్ అవుతుండటం విశేషం. దీంతో సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఏర్పడుతున్నాయి.
`టక్ జగదీష్` నిరాశపరిచిన నేపథ్యంలో సింఘరాయ్ తో హిట్ కొట్టాలని నాని కసి మీద ఉన్నాడు. అయితే మరోవైపు మాస్ రాజా రవితేజ `ఖిలాడీ` తో అదే తేదీన ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాలు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా రిలీజ్ తేదీ ఖరారు అవ్వాల్సి ఉంది. భారీ యాక్షన్ ఎంటర్ టైర్ గా ఈ చిత్రాన్ని రమేష్ వర్మ మలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి. అయితే నాని సినిమాకి రవితేజ సినిమాతో పోలిక లేదు. ఆ రెండూ వేటికవే విభిన్నమైన జానర్ లలో తెరకెక్కి విడుదలవుతున్నాయి. ఇక ఈ సినిమాలతో పాటు కరోనా క్రైసిస్ వల్ల వాయిదా పడిన చాలా సినిమాలు డిసెంబర్ నే టార్గెట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని భావిస్తున్నారు. ఇప్పటికి జనాకర్షణ ఉన్న సినిమాలుగా పుష్ప- శ్యామ్ సింఘరాయ్- ఖిలాడి చిత్రాలు జాబితాలో నిలిచాయి.
రజనీ కాంత్ నటించిన సిస్టర్ సెంటిమెంట్ మూవీ పెద్దన్న.. అలాగే విశాల్ - ఆర్య నటించిన ఎనిమీ.. సంతోష్ శోభన్ - మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన మంచి రోజులు వచ్చాయి చిత్రాలు నేడు థియేటర్లలో విడుదలై లక్ చెక్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వారం వారం మూడు నాలుగు సినిమాలు ఈనెలంతా రిలీజ్ బరిలో ఉన్నాయి. వచ్చే వారం నాలుగు సినిమాలు రిలీజ్ కి రానున్నాయి.