'కేజీఎఫ్' ప్రాంచైజీతో హోంబలే ఫిలింస్ నిర్మాణ సంస్థ వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయింది. ఇప్పుడా బ్యానర్ లో సినిమా అంటే? దర్శక-హీరోలకే ఓ బ్రాండ్ లా ఉంది. హోంబలే ఫిలింస్ లో సినిమా చేయాలని హీరోలు..టెక్నిషీయన్లు ఉత్సాం చూపిస్తున్నారు టాలీవుడ్.బాలీవుడ్..కోలీవుడ్ ఇలా భాషతో సంబంధం లేకుండా సదరు నిర్మాణ సంస్థలో సినిమా ఛాన్స్ అంటూ వెయిట్ చేస్తున్నారు.
నిర్మాణ పరంగా ఆ సంస్థ వందల కోట్లతో నిర్మాణం చేపట్టడమే అందుకు ప్రధాన కారణం అవుతుంది. రాజీలేని నిర్మాణం.. భారీ పారితోషికాలు ఆఫర్ చేయడం.. ప్రశాంత్ నీల్ తీసుకొచ్చిన బ్రాండ్ ఐడెంటిటీ ఇలా ఎ న్నో కారణాలు హోంబలే ఫిలింస్ వైపు ఆలోచించేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' అనే భారీ యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి 300 కోట్లు కేటాయించారు. ఇంకా అప్ కమింగ్ ప్రాజెక్ట్ ల్ని సదరు బ్యానర్ ముందుగానే లాక్ చేస్తుంది. మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తో సినిమా నిర్మిస్తుంది. ఇది భారీ బడ్జెట్ చిత్రమని సమాచారం. మరి ఈ సినిమాకి హీరో..దర్శకుడు ఆయనేనా? హీరో బాధ్యతలు మాత్రమే నిర్వర్తిస్తున్నారా? అన్నది తేలాలి.
అలాగే 'గురు'..'ఆకాశమే నీధ్దురా'లాంటి చిత్రాలు డైరెక్ట్ చేసిన లేడీ డైరెక్టర్ సుధ కొంగరతో కూడా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. కానీ అందులో హీరోలు ఎవరు? ఎలాంటి కంటెంట్ తో రాబోతున్నారు? వంటి వివషయాలు ఇంకా లీక్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మల్టీస్టారర్ తెలుస్తోంది.
ఇందులో సూర్య-దుల్కార్ సల్మాన్-నాని హీరోలుగా నటిస్తున్నారని వినిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కి కూడా భారీగానే బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. కన్నడ.. తెలుగు- మలయాళం-తమిళం భాషల్లో తెరకెక్కించి పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయాలన్నది ప్లాన్ గా కనిపిస్తుంది. అంటే ఈసినిమా ఆయా భాషల్లో స్ర్టెయిట్ మూవీగానే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
టాలీవుడ్..మాలీవుడ్..కోలీవుడ్..శాండిల్ వుడ్ ఇలా నాలుగు భాషల మార్కెట్ ని టార్గెట్ గాఫిక్స్ చేసి హోంబలే ఫిలింస్ నిర్మాణంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హోంబలే ఫిలింస్ 'సలార్' నిర్మాణ పనులతో బిజీగా ఉంది. ఆ సినిమా పూర్తయ్యే వరకూ ఈ మల్టీస్టారర్ ని పట్టాలెక్కించే అవకాశం లేదు.
అయితే పృథ్వీరాజ్ చిత్రాన్ని మాత్రం వీలైనంత త్వరగా ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సూర్య-నాని..దుల్కార్ వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.