మిగతా భాషలతో పోలిస్తే తెలుగులో పీరియాడికల్ ఫిలింస్ తక్కువ. రిస్కు ఎక్కువ.. హిట్టయ్యే అవకాశాలు తక్కువనే ఉద్దేశంతో టాలీవుడ్ ఈ జోనర్ వైపు పెద్దగా చూడదు. రంగస్థలం ఈ లెక్కలన్నీ మార్చేసింది. పీరియాడికల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టొచ్చని సుకుమార్ ప్రూవ్ చేశాడు. దీంతో మిగతా నిర్మాతలు - డైరెక్టర్లు కూడా ఇలాంటి కథలపై దృష్టిపెట్టారు.
నాచురల్ స్టార్ నాని తాజాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో నాని వేసుకునే జెర్సీ నెంబర్ 36 ఫొటోతో ఈ విషయం రివీల్ చేశారు. ఈ ఫొటో టైటిల్ ను బట్టి ఇది స్పోర్ట్ బేస్ డ్ సినిమా అని చెప్పేయొచ్చు. ఈ జెర్సీ కథ ప్రస్తుత టైంలో నడవదు. ఇది కూడా పీరియాడికల్ స్టోరీయే . 1985 నుంచి 1995 వరకు జరిగిన ఇన్సిడెంట్ల చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఇండియన్ క్రికెట్ టీం చేరాలని కలలు కనే ఓ కుర్రాడి కథగా జెర్సీ ఉంటుందని తెలిసింది.
డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఇంతకుముందు సుమంత్ హీరోగా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మళ్లీరావా తీశాడు. ఈ సినిమా ఆడకపోయినా గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన విధానానికి గుర్తింపు వచ్చింది. అందుకే నాని దృష్టి ఈ కొత్త డైరెక్టర్ పై పడింది. ప్రస్తుతం అక్కినేని నాగార్జునతో కలిసి నాని ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. దీంతోబాటు బిగ్ బాస్ -2 సీజన్ కు హోస్ట్ గా చేస్తున్నాడు. ఈ కమిట్ మెంట్లు పూర్తయిన వెంటనే జెర్సీ తొడుక్కుని క్రికెట్ గ్రౌండ్ లో అడుగు పెట్టనున్నాడు.