ఎట్ట‌కేల‌కు నానీకి సెట్ట‌య్యింద‌ట‌గా.. ఎవ‌రా బ్యూటీ?

Update: 2020-10-10 05:45 GMT
టాలీవుడ్ కి క‌థానాయిక‌ల కొర‌త ఎప్పుడూ ఉంటుంది. కొత్త నీరు వ‌చ్చి పాత నీరు వెళుతుంటుంది. ఇక ఇటీవ‌లి కాలంలో మ‌ల‌యాళం నుంచి వ‌చ్చిన ప్ర‌తిభావంతమైన నాయిక‌ల హ‌వా కొన‌సాగుతూనే ఉంది. మ‌ల్లూ భామ‌ల డామినేష‌న్ ఇండ‌స్ట్రీలో త‌ప్ప‌డం లేదు. అనుష్క జ‌న్మించిన మంగుళూరు కృతి స్వ‌స్థ‌లం. అయితే ముంబై బెంగ‌ళూరు మెట్రోల‌ క‌నెక్ష‌న్ ఉంది ఈ అమ్మ‌డికి. అందుకే ఈ భామ‌కు మోడ‌లింగ్ స‌హా ర్యాంప్ షోల‌తో అనుబంధం సినీఛాన్సుల‌కు దారి తీసింది.

కృతి శెట్టి తన తొలి తెలుగు చిత్రం ఉప్పెన. మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ డెబ్యూ మూవీలో ఈ అమ్మ‌డు కూడా ప‌రిచ‌యం అవుతోంది. ఇప్ప‌టికే మెగాభిమానులు స‌హా చాలా హృదయాలను గెలుచుకుంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా తొలి చిత్ర‌ దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతూ ఈ ప్రేమ‌క‌థా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. బెస్త‌వాని లైఫ్ లో ల‌వ్ స్టోరీ ఇద‌ని ఇప్ప‌టికే చిత్ర‌బృందం రివీల్ చేసిన పోస్ట‌ర్లు వెల్ల‌డించాయి. రిచ్ పూర్ ల‌వ్ స్టోరిల్లో ఈ మూవీ ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందా? అన్న ఆస‌క్తి ఉంది.

ఉప్పెన త‌ర్వాత కృతి న‌టించే మూవీ ఏది? అంటే.. తాజా స‌మాచారం ప్ర‌కారం.. నేచుర‌ల్ స్టార్ నాని స‌ర‌స‌న ఈ అమ్మ‌డు జాక్ పాట్ కొట్టేసింద‌ని స‌మాచారం. నాని చిత్రం శ్యామ్ సింఘరాయ్ లో క‌థానాయిక‌గా నటించడానికి కృతిని సంప్రదించారట‌. ఇప్ప‌టికే సంతకం చేసిందని తెలుస్తోంది. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. క‌థానాయిక ఎంపిక విషయాన్ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.
Tags:    

Similar News