ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని-సుధీర్ బాబు నటించిన చిత్రం 'V' మార్చ్ 25 న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ ఈరోజు నిర్మాతలైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు.
నిర్మాతలు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయం వెల్లడించారు. "V- ది మూవీ ప్రయాణం మా అందరికీ ఎంతో అద్భుతమైనది. కథ ఎంచుకున్న సమయం నుంచి షూటింగ్ వరకూ మేము చాలా అద్భుతంగా గడిపాము. మేము ఎంతో కష్టపడి తయారు చేసిన సినిమాను మీ ముందుకు తీసుకు రావడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. అయితే కరోనావైరస్(కోవిడ్-19) ప్రబలడంతో ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించేలా చేసింది. దీంతో మేము సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాము. ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేస్తాము" అంటూ ఒక మెసేజ్ పెట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా సోకిన సంఘటనలు వెలుగు చూడడంతో జనసందోహం ఉండే ప్రదేశాలకు ప్రజలు వెళ్ళడం లేదు. ముఖ్యంగా మాల్స్.. సినిమా థియేటర్లకు వెళ్ళడం తగ్గిపోయింది. అందుకే 'V' సినిమాను వాయిదా వేశారు. ఈ సినిమానే కాకుండా పలు ఇతర సినిమాల రిలీజులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.