నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `వీ `మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో నానీ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. గతంలో ఇంద్రగంటి-నానీది సక్సెస్ కాంబో కావడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే నానికి ఎన్ని సక్సెస్ లు ఉన్నా మార్కెట్ పరంగా వెనుకబడే ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఫ్లాప్ ఎటెంప్ట్ చేసి నానీ తనని తాను తగ్గించుకున్నాడు. విక్రమ్.కె.కుమార్ తో గ్యాంగ్ లీడర్ తనకు నెగెటివ్ అయ్యింది. ఇక తన స్థాయిని పెంచుకోవాల్సిన టైమ్ లో దానిని ఎందుకనో నిలబెట్టుకోలేకపోతున్నాడని విమర్శలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి.
మరి ఇలాంటి ఫేజ్ లో నానీ వీ రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలేవీ ఇప్పటివరకూ బయటకు రాలేదు. ఇప్పటికి మార్చి 25 రిలీజ్ ఫిక్సయ్యింది. ఇక అదే రోజు మరో ఇద్దరు హీరోలు నానీకి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన `ఒరేయ్ బుజ్జిగా` అదే రోజు రిలీజ్ అవుతుంది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన చిత్రమిది. లవ్ స్టోరీలను డీల్ చేయడంలో కొండా స్పెషలిస్ట్. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. వరుస ప్లాప్ ల తర్వాత యంగ్ హీరో ఈ సినిమాతో కంబ్యాక్ అవుతాడా అన్నది చూడాలి.
ఇక రాజ్ తరుణ్ ఈ సినిమాపైనే బోలడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఈసారైనా ఎట్టిపరిస్థితిలో గెలుపు గుర్రమెక్కాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అటు యాంకర్ ప్రదీప్ నటిస్తోన్న `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` అనే సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ మూడు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవ్వడంతో థియేటర్లు సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఒకే రోజున ముగ్గురు హీరోలు ప్రేక్షకుల ముందుకు రావడంతో ఎవరికి నష్టం? అన్నది ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. నాని మిగిలిన ఇద్దరి కన్నా పెద్ద హీరో అయినప్పటికీ `వీ`పై మరీ అంత బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. దీనికితోడు ప్రచారంలో స్పీడ్ క్రియేటివిటీ ఏదీ లేకపోవడంతో ఆడియన్స్ కి సరిగా రీచ్ అవ్వలేదన్న టాక్ వినిపిస్తోంది. మరి అంతిమంగా ఎంత మందికి గెలుపు బాట ఎక్కే సీనుంది? అన్నది చూడాల్సి ఉంది.