సెప్టెంబర్ 13వ తేదీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు మంచి రసవత్తర పోటీకి వేదికగా మారబోతోంది. ఇప్పటికీ శైలజారెడ్డి అల్లుడు డేట్ ప్రకటించనప్పటికీ దాదాపు ఖరారు అయినట్టే. యుటర్న్ మాత్రం పబ్లిసిటీ మొదలుపెట్టేసుకుంది. సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే ప్రమోషన్ కోసం ఇంజనీరింగ్ కాలేజీలు తిరిగేస్తున్నాడు. యూత్ ని టార్గెట్ చేసిన సినిమాలన్నీ ఈ మధ్య ఇలా బాగానే వర్క్ అవుట్ చేసుకుంటున్నాయి. కానీ శైలజారెడ్డి అల్లుడు టీమ్ మాత్రం డేట్ చెప్పడం లేదు కానీ లీకుల రూపంలో సెప్టెంబర్ 13 పక్కా అనేలా ఫీలర్లు వదులుతూనే ఉన్నారు. అయినా అది వదులుకుంటే పండగ ఛాన్స్ మిస్ అయినట్టే. ఆ తర్వాత 20 స్లాట్ ఖాళీగా ఉంది కానీ జస్ట్ వన్ వీక్ గ్యాప్ లో నాన్న దేవదాస్ వచ్చేస్తుంది కాబట్టి ఆ పోటీ మంచిది కాదు. సో ఎలా చూసుకున్నా వేరే ఆప్షన్ లేనట్టే. చైతు కూడా ఇది గుర్తించే కాబోలు రిలీజ్ డేట్ విషయంలో అసంతృప్తిగా ఉన్న అభిమానుల కోసం నిన్న స్పెషల్ ఫోటో సెషన్ పెట్టి మరీ ఓపిగ్గా ఒక్కొక్కరితో ఫోటోలు వరసబెట్టి దిగాడు. ఇది అక్కినేని ఫాన్స్ కి మంచి జోష్ ఇచ్చింది.
మూడు సినిమాలు ఒకదానికి ఒకటి సంబంధం లేనివి కావడం కాస్త రిలీఫ్. యు టర్న్ థ్రిల్లర్ కాగా నన్ను దోచుకుందువటే సింపుల్ లవ్ స్టోరీ. శైలజారెడ్డి అల్లుడు మాత్రం మాస్ ని టార్గెట్ చేసిన అత్తా అల్లుళ్ళ గలాటా మసాలా. సో దేని హైప్ దానికి విడిగా ఉన్నా చైతు సినిమాకే ప్లస్సులు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే పెళ్లయ్యాక భార్య సినిమాతో భర్త పోటీ పడాల్సి రావడం చైతు సామ్ లకు కొత్తగా అనిపిస్తుంటుంది.వెరైటీగా మధ్యలో మరో సినిమా ప్రేమికుడు సుధీర్ బాబు రూపంలో పోటీకి వస్తున్నాడు. పండగ కాబట్టి ఓపెనింగ్స్ వచ్చినా ఆ తర్వాత రోజుల్లో స్టడీగా నిలవాలి అంటే కంటెంట్ చాలా ముఖ్యం. ఏది వీక్ గా ఉన్నా మిగిలిన వాటికి అడ్వాంటేజ్ అవుతుంది. మరి ఈ ట్రయాంగిల్ వార్ లో ఎవరు గెలుస్తారు లేదా ముగ్గురు విజేతలుగా నిలుస్తారా తెలియాలంటే మరో పదిహేను రోజులు వేచి చూడక తప్పదు.