రాజకీయ నాయకులు సినిమాల గురించి మాట్లాడడం కాసింత విచిత్రంగానే అనిపిస్తుంది. అటు రాజకీయాల్లోను.. ఇటు సినిమాల్లోను క్యాస్ట్ బేస్డ్ గా హంగామా నెలకొనడమే ఇందుకు కారణంగా చెప్పచ్చు. కానీ ఇప్పుడు రోజులు మారుతున్నాయి. పొలిటికల్ లీడర్స్ కూడా మూవీస్ విషయంలో తమ అభిప్రాయం చెబుతున్నారు.
'రంగస్థలం లాంటి అద్భుతమైన సినిమా అందించినందుకు రామ్ చరణ్.. సుకుమార్ అండ్ రంగస్థలం కు థంబ్స్ అప్ చెప్పాల్సిందే. సినిమా పూర్తయిపోయినా సరే.. ఆ క్యారెక్టర్లు మనతో పాటు నిలిచిపోతాయి. గ్రేట్ వర్క్ గైస్' అంటూ పోస్ట్ చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఇలా తమ పార్టీకి రాజకీయంగా వ్యతిరేకం అయిన వర్గానికి చెందిన రామ్ చరణ్ సినిమాను.. లోకేష్ ఇంత ఓపెన్ గా అభినందించడం.. సోషల్ మీడియా సాక్షిగా ప్రశంసలు కురిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయ నాయకులు.. ఇలా మూవీస్ విషయంలో ఓపెన్ గా మాట్లాడుతుండడం.. ఆయా సినిమాలకు కలిసొస్తోంది. మరోవైపు పార్టీలపై జనాలకు కూడా అభిప్రాయాలు మారుతున్నాయి.
రీసెంట్ గా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. మహేష్ బాబు సినిమాను పొగుడుతూ ప్రెస్ మీట్ కూడా పెట్టిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు.. కొరటాలతో కలిసి మరీ ప్రెస్ మీట్లో పాల్గొనడం.. ఆ మూవీకి బాగా కలిసొచ్చింది. నైజాంలో ఈ మూవీ కలెక్షన్స్ కు కూడా కేటీఆర్ ప్రెస్ మీట్ కం ట్వీట్స్ బాగా కలిసొచ్చాయి. సినిమాలు ప్లస్ రాజకీయాలు కలిపి జనాలను అలరిస్తుండడం మాత్రం చెప్పుకోవాల్సిన విషయమే.