నారా రోహిత్.. ఏంటీ కొత్త లుక్?

Update: 2016-10-20 09:30 GMT
‘జ్యో అచ్యుతానంద’ రిలీజ్ ముందు ప్రమోషన్లలో పాల్గొన్నాక నెల రోజుల పైగా కనిపించకుండా పోయాడు నారా రోహిత్. ఐతే తన లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘శంకర’ విడుదలకు సిద్ధమవుతుండటంతో దాన్ని ప్రమోట్ చేయడానికి మళ్లీ మీడియా ముందుకొచ్చాడు. ఈ సందర్భంగా నారా రోహిత్ కొత్త లుక్ అందరికీ షాకిచ్చింది. ఎప్పుడూ నున్నటి షేవ్ తో కనిపించే నారా బాబు.. గుబురు గడ్డంతో దర్శనమిచ్చాడు. బహుశా ఇది తన కొత్త సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ కోసమే కావచ్చు.

రోహిత్ గతంలో ‘ఒక్కడినే’ సినిమాలో కొంచెం గడ్డంతో కనిపించాడు. ఆ తర్వాత చాలా వరకు క్లీన్ షేవ్ లుక్ లోనే కనిపిస్తున్నాడు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’లో మాత్రం రెండు రకాల లుక్స్ లో దర్శనమివ్వబోతున్నాడు రోహిత్. టీజర్లో క్లీన్ షేవ్ లుక్ లోనే కనిపించాడు. ఈ సినిమాలో అతడిది పోలీసు పాత్ర. ఈ క్యారెక్టర్లో మరో షేడ్ కూడా ఉంది. బహుశా దాని కోసమే ఈ కొత్త లుక్ కావచ్చు. గతంతో పోలిస్తే కొంచెం సన్నబడ్డ రోహిత్.. ఈ గడ్డం కూడా పెంచి డిఫరెంటుగా కనిపించాడు. విభిన్నమైన కథలతో ప్రయాణం సాగిస్తున్నప్పటికీ.. మధ్యలో కొన్ని ఎదురు దెబ్బలు తిన్న రోహిత్.. ‘జ్యో అచ్యుతానంద’తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం అతడి చేతిలో ఉన్నవన్నీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులే. చాన్నాళ్లు వాయిదా పడి వస్తున్న ‘శంకర’ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో కానీ.. ఆ తర్వాత రాబోయే అప్పట్లో ఒకడుండేవాడు.. కథలో రాజకుమారి సినిమాలు మాత్రం భలే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News