షాకిస్తున్న నారా రోహిత్ లుక్

Update: 2017-06-28 06:49 GMT
తొలి సినిమా ‘బాణం’ దగ్గర్నుంచే కథల ఎంపికలో కొత్త దారిలో నడుస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు నారా రోహిత్. పెద్ద బ్యాగ్రౌండ్ నుంచే వచ్చినప్పటికీ మాస్ ఇమేజ్ కోసమో.. లేని పోని బిల్డప్పుల కోసం ట్రై చేయకుండా కేవలం కథకు తగ్గట్లుగా నటిస్తూ సాగిపోవడం రోహిత్ ను ఎక్కువమందికి చేరువ చేసింది. ఐతే నారా బాబు చేసిన చాలా సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి కానీ.. అతడి నటనా ఆకట్టుకుంది కానీ.. అతడి లుక్ మీద మాత్రం విమర్శలు వ్యక్తమయ్యాయి. పోలీస్.. బాక్సర్ లాంటి క్యారెక్టర్లు చేస్తూ బొద్దుగా కనిపించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఐతే లుక్ మార్చుకుంటానని చాన్నాళ్ల నుంచి చెబుతున్న రోహిత్.. ఎట్టకేలకు మాట నిలబెట్టుకున్నాడు.

ఈ మధ్యే తన సినిమాకు సంబంధించిన ఒక ప్రెస్ మీట్లో రోహిత్ సన్నబడి కనిపించాడు. అతడిలో మార్పు స్పష్టంగా కనిపించింది. ఐతే లేటెస్ట్ లుక్ చూస్తే షాకైపోవాల్సిందే. అంతలా మార్పు చూపిస్తున్నాడతను. జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్నప్పటి ఫొటోలే సోషల్ మీడియాలో షేర్ చేశాడు రోహిత్. ఇంతకుముందు బొద్దుగా ఉన్న రోహిత్.. ఇప్పుడు సాధారణ స్థితి కంటే కూడా తగ్గిపోయాడు. తొలి సినిమా ‘బాణం’లో కనిపించిందానికంటే కూడా సన్నగా దర్శనమిస్తున్నాడు. ఇన్నాళ్లూ రోహిత్ ను చూసిన కళ్లతో ఇప్పుడు చూస్తే షాకైపోవడం ఖాయం. ఇప్పుడు కనిపిస్తున్న లుక్ లోనే సన్నగా అనిపిస్తుంటే.. తాను ఇంకా బరువు తగ్గబోతున్నట్లు రోహిత్ హింట్ ఇవ్వడం విశేషం. రోహిత్ నటించిన శమంతకమణి.. కథలో రాజకుమారి విడుదలకు సిద్ధమయ్యాయి. వీటి తర్వాత రాబోయే సినిమాల్లో రోహిత్ కొత్త లుక్ లో దర్శనమివ్వనున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News