మనోజ్ కోసం నారా గళం

Update: 2017-11-08 17:25 GMT
మంచు మనోజ్ నటించిన ఒక్కడు మిగిలాడు చిత్రం రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ సహా అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఈ శుక్రవారం నాడు.. గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. విజయ్ మూవీ అదిరింది.. సందీప్ కిషన్ కేరాఫ్ సూర్య.. విశాల్ మూవీ డిటెక్టివ్ లతో పోటీ పడుతున్నా.. ఒక్కడు మిగిలాడు చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఇప్పుడీ చిత్రానికి సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోస్ అందరిలోకి.. అత్యంత క్రేజీ వాయిస్ ఎవరిది అంటే.. ఎవరైనా చెప్పే ఒకే మాట.. నారా రోహిత్ అనే. తన వాయిస్ తోనే ఎంతో మాయ చేసేయగల ఈ యంగ్ హీరో.. ఇప్పుడు మంచు మనోజ్ కోసం డబ్బింగ్ చెప్పాడట. రీసెంట్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ విషయం బైటకు వచ్చింది. నారా రోహిత్ వాయిస్ ఓవర్.. ఒక్కడు మిగిలాడు మూవీకి హైలైట్ అవుతుందని అంటున్నారు.

తెలుగుతో పాటు.. తమిళ్.. కన్నడ.. హిందీ భాషల్లో ఒకే సారి రిలీజ్ కానున్న ఒక్కడు మిగిలాడు చిత్రంలో అనీషా ఆంబ్రోస్ హీరోయిన్ నటించింది. అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో.. మంచు మనోజ్ రెండు క్యారెక్టర్లలో నటించాడు. ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ పాత్రతో పాటు.. ఓ కాలేజ్ స్టూడెంట్ గా నటించాడు మంచు మనోజ్.
Tags:    

Similar News