నారా రోహిత్ అంటేనే ఆడియన్స్ లో ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. తన మొదటి సినిమా నుంచి విభిన్నమైన చిత్రాలను చేస్తున్న నారా రోహిత్.. మధ్యలో కొన్ని మాస్ మసాలాలు చేసినా.. మళ్లీ తన పాత రూట్ లోకి వచ్చేశాడు. కథ కథనం వినూత్నంగా ఉండే సినిమాలకు పెద్ద పీట వేస్తున్నాడు. తన కేరక్టర్ గురించి కూడా పట్టించుకోకుండా సినిమా చేయగల డేర్ ఉన్న హీరో అనిపించుకున్నాడు.
రీసెంట్ గా మరో ముగ్గురు హీరోలతో కలిసి శమంతకమణి అంటూ ఓ యంగ్ హీరోల మల్టీస్టారర్ మూవీలో కూడా నటించేయడం విశేషం. అయితే.. ఎప్పుడూ ప్రయోగాలకు ఇంపార్టెన్స్ ఇచ్చే నారా రోహిత్.. కొత్త దర్శకులతో సినిమాలు చేస్తుంటాడు. కానీ ఇప్పుడు తనతో పాటు సినిమాలు చేసినవారితో మళ్లీ జత కట్టేందుకు కూడా సై అనేస్తుండడం విశేషం. తనతో బాణం మూవీ తీసిన చైతన్య దంతులూరితో మరో మూవీకి నారా రోహిత్ ఒప్పుకున్నాడని తెలిసిందే. ఇప్పుడు సావిత్రి డైరెక్ట్ చేసిన యంగ్ డైరెక్టర్ పవన్ సాదినేనికి కూడా ఓకే చెప్పాడట నారా రోహిత్. ప్రస్తుతం కథలో రాజకుమారి.. బాలకృష్ణుడు మూవీస్ ని రిలీజ్ కి రెడీ చేస్తున్న నారా వారబ్బాయి.. పవన్ సాదినేనితో భీముడు అనే చిత్రానికి ఓకే చెప్పాడని అంటున్నారు.
తన ఫిజిక్ పై అనేక విమర్శలు రావడంతో.. ప్రస్తుతం బాగా సన్నబడేందుకు కష్టపడుతున్న నారా రోహిత్.. తగ్గిన బాడీతోనే భీముడులో నటిస్తాడట. పైగా ఇది హారర్ థ్రిల్లర్ మూవీ అంటున్నాడు. అంటే నారా రోహిత్ భయపెట్టే భీముడిగా కనిపించనున్నాడన్న మాట. ఈ కొత్త కాన్సెప్ట్ నారా వారబ్బాయికి ఎలా కలిసొస్తుందో చూద్దాం.