నారా రోహిత్ సినిమాకు మోక్షం

Update: 2017-09-10 11:18 GMT
నారా రోహిత్ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా ‘కథలో రాజకుమారి’ పూర్తయి కొన్ని నెలలు దాటింది. కానీ సరైన రిలీజ్ డేట్ దొరక్కపోవడం వల్ల ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఆగస్టు 25న రిలీజ్ పక్కా అన్నారు కానీ.. ఆ తేదీకి కూడా సినిమా విడుదల కాలేదు. ఐతే ఎట్టకేలకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబరు 15న.. అంటే ఈ శుక్రవారమే ‘కథలో రాజకుమారి’ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ డేటు దాటితే ఇంకో నెల రోజుల పాటు ఖాళీ ఉండదు. దసరా-దీపావళి మధ్య భారీ సినిమాలు వరుస కట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హడావుడిగా సెప్టెంబరు 15న రిలీజ్‌ కు సన్నాహాలు చేస్తున్నారు.

కొత్త దర్శకుడు మహేష్ సూరపనేని రూపొందించిన ‘కథలో రాజకుమారి’ ఆసక్తికర ప్రోమోలతో ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి రేకెత్తించింది. ‘జ్యో అచ్యుతానంద’ తర్వాత రోహిత్-నాగశౌర్య కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ఇది. మలయాళ భామ నమిత ప్రమోద్ కథానాయికగా నటించింది. ఇది సినీ నేపథ్యంలో సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి రోహిత్ నిర్మాణ భాగస్వామి కూడా కావడం విశేషం. ఈ శుక్రవారం దీంతో పాటు ‘ఉంగరాల రాంబాబు’.. ‘శ్రీవల్లీ’.. ‘వీడెవడు’..  ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’ లాంటి సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ఐతే వాటిలో కొంచెం ఎడ్జ్ ఉన్నది ‘కథలో రాజకుమారి’కే. ఈ అడ్వాంటేజీని ఈ సినిమా ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News