స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన కొత్త ఆఫీస్ కు మారిన సంగతి తెలిసిందే. ఇప్పటి దాకా గీతా ఆర్ట్స్ ప్రెమిసెస్ లోనే తనకో ఛాంబర్ ఉంచుకున్న బన్నీకి దర్శకనిర్మాతలతో చర్చలతో పాటు తనను వ్యక్తిగతంగా కలుసుకోవడానికి వస్తున్న మీడియా ప్లస్ ఫ్యాన్స్ కు ఇబ్బందిగా మారుతోంది అనే ఉద్దేశంతో తన టేస్ట్ ప్రతిబింబించేలా ప్రత్యేకంగా నిర్మించుకున్నాడు. ఇటీవలే ఓపెనింగ్ చేసుకుని స్పెషల్ గా తీసుకున్న ఫోటోలను కూడా షేర్ చేసుకున్నాడు. కాకపోతే లోపల ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి అనే అవగాహన బయటి వాళ్లకు రాలేదు.
అన్నట్టు ఈ కొత్త సెట్ అప్ కు నారా హీరో రోహిత్ కు కనెక్షన్ ఉందట. అదెలా అనుకుంటున్నారా. ఆఫీస్ కి మొత్తం డిజైన్ ఇంటీరియర్ ని ఒక ఆర్కిటెక్ రూపొందించగా బయట లాన్ తో పాటు లోపల అవసరమైన చోట గ్రీనరీని సెట్ చేయడానికి మరో సంస్థకు డీల్ కుదుర్చుకున్నాడు బన్నీ. గ్రీనరీ మీద ఇంత ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి కారణం గతంలో నారా రోహిత్ ఆఫీస్ తెలుగు టాకీస్ కు పని చేసింది సదరు సంస్థేనట. ఆ వర్క్ చూసి బాగా ఇంప్రెస్ అయిన బన్నీ ప్రత్యేకంగా తన గ్రీనరీ వర్క్ మొత్తం అతనికే అప్పగించినట్టు తెలిసింది.
అంచనాలకు తగ్గట్టే ఒక చక్కని అనుభూతి కలిగేలా సదరు డిజైనర్ మొత్తం సెట్ చేసినట్టు తెలిసింది. త్వరలో కొత్త సినిమా విశేషాలతో షేర్ చేసుకోబోయే ప్రెస్ మీట్ ని ఇందులోనే పెట్టాలని బన్నీ అనుకుంటున్నాడట. అందుకే ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులను మీడియా ప్రతినిధులను ఆహ్వానించకుండా జాగ్రత్త పడినట్టు తెలిసింది. ఈ రకంగా నారా రోహిత్ కు బన్నీ ఆఫీస్ తో కనెక్టన్ ఏర్పడిందని అర్థమవుతోంది. మరి బన్నీ తన ఆఫీస్ ని పూర్తిగా చూపించే ఆ ఘడియలు ఎప్పుడు రానున్నాయో.