నారా వారబ్బాయి బాగా తగ్గాడమ్మా!

Update: 2017-06-16 05:31 GMT
ప్రత్యేకమైన థీమ్ లతో సినిమాలు తీయడంలో.. నారా రోహిత్ కు అంతకంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వరుసగా సినిమాలు చేస్తుంటాడు కానీ.. ఈ యంగ్ హీరోపై మొదటి నుంచి తన సైజ్ విషయంలో విమర్శలు ఉన్నాయి. తను స్లిమ్ గా మారతానంటూ ఇప్పటికి చాలా సార్లు చెప్పాడు.. ఫ్యాన్స్ కు మాట కూడా ఇచ్చాడు కానీ.. ఇప్పటివరకూ నిలబెట్టుకోలేదు.

కానీ గత ఆరు నెలలుగా మాత్రం నారా వారబ్బాయి తెగ కష్టపడిపోతున్నాడు. గంటల తరబడి జిమ్ లో వర్కవుట్స్ చేస్తూనే ఉన్నాడు. రోజూ ఉదయం 3 గంటలు.. సాయంత్రం 3-4 గంటలు కష్టపడుతున్నాడు నారా రోహిత్. ఇలా దాదాపు 6 నెలలు వర్కవుట్స్ చేస్తే.. ఇప్పుడు తగిన షేప్ లోకి రాగలిగాడు ఈ హీరో. ఈ సమయంలో 15 కిలోల బరువు తగ్గించుకుని కొత్త లుక్ లోకి వచ్చేశాడు. ఇప్పుడు కుర్ర హీరోల మల్టీ స్టారర్ మూవీ శమంతకమణి చిత్రంలో తన కొత్త లుక్ లోనే నటిస్తున్నాడు నారా రోహిత్.

ఈ షేప్ లోకి వచ్చేందుకు నారా రోహిత్ చాలా శ్రమించాడని.. 6 నెలలు ఏ మాత్రం గ్యాప్ తీసుకోలేదని సన్నిహితులు చెబుతున్నారు. ఇది కాకుండా.. ప్రస్తుతం కథలో రాజకుమారి.. వీరభోగ వసంతరాయలు.. పండగలా వచ్చాడు చిత్రాలలో కూడా నటిస్తున్నాడు నారా రోహిత్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News