రియల్‌ మోడీ హిట్‌... రీల్‌ మోడీ ఫ్లాప్‌

Update: 2019-06-01 05:56 GMT
2014 పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో ఒక సునామి తరహాలో మోడీ అధికారంలోకి వచ్చాడు. బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో అంతా ఆశ్చర్యంగా చూశారు. మోడీకి దేశం అండగా నిలిచిన తీరు రాజకీయ విశ్లేషకులను సైతం షాక్‌కు గురి చేసింది. 2014లో అద్బుత విజయాన్ని అందుకున్న మోడీ 2019 వచ్చేప్పటికి తన ప్రాభవంను కోల్పోయాడని, గతంతో పోల్చితే మోడీ క్రేజ్‌ చాలా తగ్గిందని రాజకీయ విశ్లేషకులు భావించారు. మరోసారి మోడీ పీఎం అవ్వడం కష్టమే అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని తాజాగా జరిగిన పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో మోడీ మరింత ఘన విజయాన్ని సాధించి తాజాగా పీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. వరుసగా రెండవ సారి పీఎంగా ప్రమాణ స్వీకారం చేసి సూపర్‌ హిట్‌ అయ్యాడు. రియల్‌ మోడీ రాజకీయాల్లో సూపర్‌ హిట్‌ అయితే రీల్‌ మోడీ మాత్రం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాడు.

ఎన్నో వివాదాలు.. విమర్శల మద్య తెరకెక్కిన 'పీఎం నరేంద్ర మోడీ' చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పార్లమెంటు ఎన్నికలు జరిగే సమయంలోనే ఈ సినిమా రావాల్సి ఉన్నా కూడా ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న కారణంగా సినిమాను విడుదలకు ఈసీ అడ్డుకుంది. కోర్టుకు వెళ్లినా కూడా ప్రయోజనం దక్కలేదు. మోడీ మళ్లీ ప్రధాని అయిన తర్వాత మోడీ సినిమాకు మోక్షం దక్కింది.

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మోడీ చిత్రంను ప్రేక్షకులు తిరష్కరించారు. బాలీవుడ్‌ సినిమాలు మొదటి రోజే 100 కోట్ల వసూళ్లు సాధిస్తుంటే ఈ చిత్రం మాత్రం వారం రోజుల్లో కేవలం 16 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ మాత్రమే రాబట్టింది. లాంగ్‌ రన్‌ లో కనీసం 15 కోట్ల షేర్‌ ను కూడా రాబట్టలేదని తేలిపోయింది. ఈ సినిమాపై మొదటి నుండి హైప్‌ ఉన్నా కూడా కంటెంట్‌ పరంగా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. వివేక్‌ ఒబేరాయ్‌ ప్రధాన పాత్ర పోషించిన మోడీ బయోపిక్‌ బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటలేక పోయింది. ఒక వైపు మోడీ ప్రధానిగా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేసి సత్తా చాటితే ఈ సినిమా మాత్రం కనీసం చిన్న చిత్రాల రేంజ్‌ లో కూడా వసూళ్లు రాబట్టలేక చతికిల్లపడింది.
Tags:    

Similar News