తనదైన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తూ.. తానే ఒక హాట్ టాపిక్ గా ఉంటారు బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన అందంతో.. అభినయంతో బాలీవుడ్ టాప్ నటిగా సాగుతున్న ఆమె తనకు అనిపించిన ఏ విషయంపై నైనా సుత్తి లేకుండా సూటిగా మాట్లాడేస్తారు. ఇప్పటికే పలు రంగాలకు చెందిన ప్రముఖుల మనసుల్ని దోచేసి.. వారి అభిమానాన్ని పొందిన ప్రధాని నరేంద్ర మోడీ మీద తనకున్న అభిమానాన్ని ఓపెన్ గా ప్రదర్శించారు కంగనా.
తాజాగా రాష్ట్రపతి భవన్ లో మోడీ బాల్యంలోని కొంత భాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఛలో జీతే హైనా అనే లఘు చిత్రాన్ని నిర్మించారు. 32 నిమిసాల నిడివి ఉన్న ఈ బుజ్జి మూవీని రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేకంగా స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్రమంత్రులతో పాటు.. బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా కూడా హాజరయ్యారు.
ఇప్పటికే ప్రధాని మోడీ మీద తనకున్న అభిమానాన్ని ఓపెన్ గా వెల్లడించి వార్తల్లోకి ఎక్కిన వైనం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మోడీ బాల్యంపై నిర్మించిన లఘు చిత్రంపై కంగనా ఎలా రియాక్ట్ అయ్యారంటే.. తల్లిదండ్రుల అండ లేకుండా తన స్వశక్తితో ఎదిగిన మోడీ లాంటి అధినేత దేశానికి అవసరం ఎంతో ఉంది. ఆయన మరో ఐదేళ్లు ప్రధానమంత్రి పదవిని చేపట్టాల్సిన అవసరం చాలా ుందన్నారు.
ఈ లఘు చిత్రంతో ప్రధాని నరేంద్ర మోడీ బాల్యాన్ని చూపించినప్పుడు ఆయన ఎంతో సూర్ఫదూర్పి అన్న విషయాన్ని ఆయన బాల్యంలో చోటు చేసుకున్న ఉదంతాల్ని.. వాటిని ఎదుర్కొన్న తీరును ప్రస్తావించిన కంగనా.. మోడీ బాల్యంపై ఆమె విపరీతంగా స్ఫూర్తి పొందిన వైనాన్ని వెల్లడించారు. తనకు తానుగా ఒక ఒక కుర్రాడు.. దేశ ప్రధాని లాంటి అత్యున్నత స్థాయికి చేరిన విషయాన్ని ప్రస్తావించిన ఆమె.. మోడీ మరో ఐదేళ్ల ప్రధానిగా కొనసాగాల్సిన అవసరాన్ని ఆమె వెల్లడించారు.
ఒక మీడియా ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన కంగనా.. మోడీ పాలనపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. పట్టుదలతో.. కలిసికట్టుగా ఉండటంతో పాటు నిరంతర శ్రమతో మార్పుల కోసం మోడీ ప్రయత్నిస్తున్నారని.. తాజా లఘు చిత్రం కేవలం మోడీని స్ఫూర్తిగా తీసుకోవటమే కాదు.. దీన్ని చూసినప్పుడు తమకు తాముగా కష్టపడి పైకి వచ్చిన వారంతా మోడీని అభిమానిస్తారంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలు రంగాలకు చెందిన ప్రముఖులను తన మాటలతో మనసుల్ని దోచేసిన మోడీ.. ఈసారి బాలీవుడ్ క్వీన్ మనసును దోచేశారని చెప్పక తప్పదు.