'కాంతారా'ను వీక్షించనున్న ప్రధాని మోదీ.. డేట్ ఫిక్స్..!

Update: 2022-10-26 05:32 GMT
ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల హవా నడిచింది. కానీ ఇప్పుడు ఈ స్థానాన్ని సౌత్ ఇండస్ట్రీ భర్తీ చేస్తోంది. ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమాలే అన్నంతగా పరిస్థితులు మారిపోయాయి. నార్త్ ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా సౌత్ సినిమాలను ఆదరిస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాలు కలెక్షన్ల మోత మోగిస్తున్నాయి.

'బాహుబలి-1'.. 'బాహుబలి-2'.. 'కేజీఎఫ్-1'.. 'కేజీఎఫ్-2'.. 'కార్తీకేయ-2' సినిమాలన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఈ సినిమాలకు సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మూవీలో కంటెంట్ ఉంటే చాలు ఆదరించేందుకు తాము ఎప్పుడు సిద్ధమనే ఇండికేషన్స్ అభిమానుల నుంచి వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కంటెంట్ ఉన్న సినిమాలన్నీ ఇతర భాషల్లోకి నేరుగా డబ్బింగ్ అవుతున్నాయి. ప్యాన్ ఇండియా సినిమాలుగా పిలువబడుతూ బాక్సాఫీసును షేక్ చేస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన కన్నడ మూవీ 'కాంతారా' సైతం నార్త్, సౌత్ అనే తేడా లేకుండా కలెక్షన్లు రాబడుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.

ఈ సినిమా విడుదలై 25 రోజులు కావొస్తున్నా కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఇప్పటికే 230 కోట్ల మార్క్ ను దాటేసింది. దీంతో కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. ప్రస్తుతానికి ఈ మూవీ కేజీఎఫ్ సిరీసుల సరసన నిలుస్తోంది.

ఈ నేపథ్యంలో 'కాంతారా' మూవీని భారత ప్రధాని మోదీ వీక్షించనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు నవంబర్ 14న ప్రధాని మోదీ 'కాంతారా' దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టి కలిసి ప్రత్యేక స్క్రీనింగ్ లో తిలకించనున్నారు.

బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న 'కాంతారా'కు ఈ న్యూస్ మరింత బూస్ట్ ఇవ్వడం ఖాయం కన్పిస్తోంది. ఈ సినిమా చూశాక ప్రధాని మోదీ ఏవిధంగా స్పందిస్తారో అనేది ఆసక్తికి రేపుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News