భారతదేశంలోనే నంబర్ 1 దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు రాజ్ కుమార్ హీరాణి. అతడు దర్శకత్వం వహించిన పీకే ప్రపంచవ్యాప్తంగా రికార్డులు తిరగరాసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 700 కోట్లు పైగా వసూలు చేసింది. కేవలం విదేశీ మార్కెట్ నుంచి 300 కోట్లు వసూలు చేసి ఇంతవరకూ ఏ ఇతర భారతీయ సినిమా సాధించని రికార్డుల్ని నెలకొల్పింది. అంతటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ నుంచి ఓ సినిమా వస్తోంది అంటూ ఇండస్ర్టీలో డిష్కసన్ రావడం సహజమే. ప్రస్తుతం రాజ్ కుమార్ హీరాణీ ఏ సినిమా తీయబోతున్నారు? .. దీనికి సమాధానం వచ్చింది. రాజ్ కుమార్ హిరాణీ తన స్నేహితుడు సంజయ్ దత్ జీవితాన్ని వెండితెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు.
ఇప్పటికే స్ర్కిప్టు రెడీ అయ్యింది. సంజయ్ దత్ విని ఎంతో సంతృప్తి చెందారు. ఈ సంగతిని హిరాణీ స్వయంగా చెప్పారు. ఇందులో సుగర్ కోటెడ్ పిల్ తరహాలో సంజయ్ దత్ గురించి లేనిదేదీ చెప్పడం లేదు. అతడు ఒరిజినల్ గా ఎలా ఉంటాడు .. అన్నది యథాతథంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. రెండున్నర గంటల సినిమాలో అతడి జీవితాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నాం. సంజూ జీవితంలో ఏం జరిగింది? అన్నది మాత్రమే చూపిస్తున్నాం. నిజాల్ని దాచేయకుండా నిజాయితీగా ప్రతి ఫ్రేముని చూపిస్తామని రాజ్ కుమార్ హిరాణీ అన్నారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. అలాగే మున్నాభాయ్ 3 చిత్రానికి సన్నాహాలు చేస్తున్నామని, స్ర్కిప్టు ఫైనల్ అయితే సెట్స్ కెళతామని రాజ్ కుమార్ హిరాణీ వ్యాఖ్యానించారు.