అల్జీమర్స్ వస్తే అన్నీ మరిచిపోవడమే. తినే తిండి దగ్గర్నుంచి మనిషికి ఏదీ గుర్తుండదు. కానీ తనకు ఒకవేళ అల్జీమర్స్ వచ్చినా.. ‘బాహుబలి’ సినిమా విషయంలో జరిగిన విషయాలేవీ మరిచిపోలేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నాజర్. ‘బాహుబలి’ తనకు ఒక జీవిత కాల అనుభవమని ఆయన వ్యాఖ్యానించాడు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ కూడా ఇది మన సినిమా అన్నట్లుగా పని చేశారని.. అంతగా దీన్ని ఓన్ చేసుకున్నారని.. తనతో పాటు చాలామంది నటీనటులు.. టెక్నీషియన్లు ఇప్పటిదాకా ఏ సినిమాకూ ఇన్ని రోజులు పని చేసి ఉండరని నాజర్ అన్నాడు.
రెండేళ్లుగా తాను ఎక్కడికి వెళ్లినా ‘బాహుబలి-2’ గురించే అడుగుతున్నారని.. ఈ మధ్య రిలీజ్ డేట్ గురించే ఎక్కువ ప్రశ్నలు వేస్తున్నారని.. తమిళనాట మారుమూల ప్రాంతాలకు వెళ్లినా కూడా ఏప్రిల్ 28న సినిమా కచ్చితంగా వచ్చేస్తుంది కదా అని అడుగుతున్నారని నాజర్ అన్నాడు. ఈ సినిమా కోసం రాజమౌళి హీరో ప్రభాస్ తో పాటు అందరినీ సిక్స్ ప్యాక్ లు చేయమన్నాడని.. హీరోయిన్ అనుష్కకు కూడా అలాగే చెప్పాడని.. కానీ తనకు మాత్రమే మినహాయింపు ఇచ్చాడని నాజర్ అన్నాడు. బిజ్జాలదేవ పాత్రకు ఒక చెయ్యి పని చేయదు కాబట్టి.. వ్యాయామాలు చేయడు అన్న లాజిక్ ప్రకారం తనకు ఫ్యామిలీ ప్యాక్ లో ఉండే అవకాశం రాజమౌళి ఇచ్చాడని నాజర్ చమత్కరించడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/